For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అరుదైన గౌరవం: ఆరో భారత క్రికెటర్‌‌గా ఐసీసీ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో సచిన్‌

Sachin Tendulkar 6th Indian To Be Inducted Into ICC Hall Of Fame || Oneindia Telugu
Sachin Tendulkar, Allan Donald Inducted Into ICC Hall Of Fame

హైదరాబాద్: క్రికెట్‌ లెజెండ్‌ సచిన్‌ టెండూల్కర్‌కి అరుదైన గౌరవం లభించింది. ఐసీసీ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో సచిన్‌కు చోటు కల్పిస్తున్నట్లు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ అధికారిక ప్రకటన చేసింది. సచిన్‌తో పాటు దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్‌ అలన్‌ డోనాల్డ్‌, ఆసీస్‌ మాజీ మహిళా క్రికెటర్‌ క్యాథిరిన్‌ ఫిట్జ్‌పాట్రిక్‌లను హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో చోటు కల్పించారు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ఆరో క్రికెటర్‌గా సచిన్ టెండూల్కర్

ఆరో క్రికెటర్‌గా సచిన్ టెండూల్కర్

దీంతో భారత్ నుంచి ఈ ఘనత సాధించిన ఆరో క్రికెటర్‌గా సచిన్ టెండూల్కర్ అరుదైన ఘనత సాధించాడు. సచిన్‌ టెండూల్కర్ కన్నా ముందు బిషన్‌సింగ్ బేడి(2009), సునీల్‌ గవాస్కర్‌(2009), కపిల్‌దేవ్‌(2009), అనిల్ కుంబ్లే (2015), రాహుల్‌ ద్రవిడ్‌ (2018) ఈ ఘనత దక్కించుకున్న వారి జాబితాలో ఉన్నారు.

ఐసీసీ హాల్ ఆఫ్‌ ఫేమ్‌‌లో

ఐసీసీ హాల్ ఆఫ్‌ ఫేమ్‌‌లో

ఐసీసీ హాల్ ఆఫ్‌ ఫేమ్‌‌లో చోటు దక్కడంపై సచిన్ టెండూల్కర్ మాట్లాడుతూ "నాకు లభించిన ఈ గుర్తింపు పట్ల చాలా సంతోషంగా ఉంది, ఇది నాకు దక్కిన అరుదైన గౌరవంగా భావిస్తున్నా" అని సచిన్ పేర్కొన్నాడు. ప్రపంచ క్రికెట్‌లో వంద సెంచరీలు బాదిన ఏకైక క్రికెటర్ సచినేనని ఐసీసీ ప్రశంసలు కురిపించింది.

సచిన్‌ టెండూల్కర్‌కి శుభాకాంక్షలు

సచిన్‌ టెండూల్కర్‌కి శుభాకాంక్షలు

ఈ సందర్భంగా శ్రీలంక మాజీ కెప్టెన్‌ మహేలా జయవర్దనే క్రికెట్ లెజెండ్ సచిన్‌ టెండూల్కర్‌కి శుభాకాంక్షలు తెలిపాడు. ఇందుకు సంబంధించిన వీడియోని ఐసీసీ తన ట్విట్టర్‌లో షేర్ చేసింది. "లెజెండ్‌ అనే పదం సచిన్‌కి తక్కువే.. తాజాగా ఐసీసీ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో ఆయనకి స్థానం కల్పించాం" అని ఐసీసీ ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకుంది.

అలెన్ డొనాల్డ్ సైతం

అలెన్ డొనాల్డ్ సైతం

కాగా, దక్షిణాఫ్రికా మాజీ పేసర్‌ అలన్‌ డోనాల్డ్‌(52) సైతం ఐసీసీ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌కి ఎంపికయ్యాడు. డొనాల్డ్ టెస్టుల్లో 330, వన్డేల్లో 272 వికెట్లు పడగొట్టాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి అలెన్ డొనాల్డ్ 2003లో వీడ్కోలు పలికాడు. మహిళా క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన రెండో క్రికెటర్‌‌గా పేరొందిన ఫిట్జ్‌పాట్రిక్‌‌కు అరుదైన గౌరవం లభించింది. వన్డేల్లో 180, టెస్టుల్లో 60 వికెట్లు తీసింది.

Story first published: Friday, July 19, 2019, 11:42 [IST]
Other articles published on Jul 19, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+