
96 అర్థ సెంచరీలు :
తన వన్డే కెరీలో 463 మ్యాచ్‌లు ఆడిన సచిన్ 96 అర్థసెంచరీలు చేశారు. ఇది ఒక రికార్డు. సాధారణంగా అర్థ సెంచరీల రికార్డుపై ఎక్కువ దృష్టి ఉండదు. అయితే, ప్రస్తుత భారత కెప్టెన్ కోహ్లి ఇప్పటికే 46 అర్థ సెంచరీలను సాధించారు. మరో 50 అర్థ సెంచరీలు చేస్తే గానీ ఈ రికార్డును అధిగమించలేరు.

100 అంతర్జాతీయ సెంచరీలు :
2012లో 100 అంతర్జాతీయ సెంచరీలు సాధించిన ఏకైక క్రికెటర్‌గా సచిన్ నిలిచాడు. ఆ రికార్డు నెలకొల్పిన ఆరేళ్ల తర్వాత విరాట్ కొహ్లీ 56 సెంచరీలు, హషీమ్ ఆమ్లా 54 సెంచరీలతో దీనిపై కన్నేశారు. అయితే, కొద్ది సంవత్సరాలుగా నిలకడగా ఆడుతూ వస్తున్న భారత కెప్టెన్ విరాట్ కొహ్లీ ఈ రికార్డును కచ్చితంగా అధిగమిస్తారని నిపుణులు అంటున్నారు. అయితే, మరో 44 సెంచరీలను చేస్తే తప్ప కొహ్లీ ఈ ఫీట్‌ను సాధించలేరు.

200 టెస్టు మ్యాచ్‌లు :
సచిన్ తన క్రికెట్ కెరీర్‌లో 200 అంతర్జాతీయ టెస్టు మ్యాచ్‌లు ఆడారు. ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాళ్లు స్టీవ్ వా, రికీ పాంటింగ్‌లు 168 టెస్టులు ఆడిన తర్వాత రిటైర్మెంట్ ప్రకటించారు. ప్రస్తుతం అల్‌స్టెర్ కుక్ (154 టెస్టులు), జేమ్స్ అండర్సన్ (136 టెస్టులు)లు ఇంకా టెస్టు క్రికెట్‌లో కొనసాగుతున్నారు. అయితే, వీరు ఇరువురూ 30 ఏళ్లకు మించి వయసు పైబడిన వారే. 200 టెస్టులు ఆడి సచిన్ రికార్డును వీరు బ్రేక్ చేస్తారా? అన్నది అనుమానమే.

టెస్టు మ్యాచ్‌లలో 15,921 పరుగులు :
టెస్టు క్రికెట్‌లో ఇన్ని పరుగులు సాధించిన ఏకైక ఆటగాడు సచిన్ మాత్రమే. ఇంగ్లండ్ జట్టు కెప్టెన్ అల్‌స్టెర్ కుక్ మాత్రమే 12,028 పరుగులతో సచిన్‌కు చేరువలో ఉన్నాడు. మిగతా బ్యాట్స్‌మన్లకు ఆ రికార్డు స్వప్నమే.

18,426 వన్డే పరుగులు :
సచిన్ నెలకొల్పిన ఈ రికార్డు కచ్చితంగా ఈతరం ఆటగాళ్లు బ్రేక్ చేస్తారని భావిస్తున్నారు. ఈ రికార్డుకు టాప్ కంటెడర్స్‌గా ఉన్న ప్రస్తుత ఆటగాళ్లు ఎంఎస్ ధోని (9,967 పరుగులు), కోహ్లి (9,588 పరుగులు), క్రిస్ గేల్ (9,585 పరుగులు), ఏబీ డివిలియర్స్ (9,577 పరుగులు). శ్రీలంక మాజీ క్రికెటర్ కుమార సంగక్కర 14, 234 పరుగులతో సచిన్ తర్వాత రెండో స్థానంలో ఉన్నారు.


Click it and Unblock the Notifications












