Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వేయి పరుగుల మైలు రాయి దాటిన సచిన్ టెండూల్కర్

Sachin Tendulkar
మొహాలీ: భారత బ్యాట్స్ మన్ సచిన్ టెండుల్కర్ ఈ సంవత్సరం 8 మ్యాచ్ లలోనే 1000 పరుగులు చేసి రికార్డు సృష్టించాడు. ఏ టెస్టు అయినా, వన్డే అయినా, ట్వంట్వీ 20 అయినా ఏ ఫార్మాట్ లో అయినా ఇప్పటికీ సచిన్ సూపర్ ఫామ్ లో ఉన్నాడు. వయసు మీద పడుతున్నప్పటికీ ఆయన పరుగుల దాహం తీరడం లేదు. భారత్ ఇప్పటికీ ఏ మ్యాచ్ ఆడుతున్నప్పటికీ సచిన్ ఉన్నాడా లేడా అనే భారత ప్రేక్షకులు చూస్తారు. సచిన్ ఉంటేనే గెలుపుపై ఆశలు పెట్టుకుంటారు.

కొన్ని రోజుల క్రితం సచిన్ ఫామ్ లో లేడనే ఆరోపణలు ఎదర్కొన్నాడు. ఫామ్ లో లేడన్న వారికి తన సత్తా ఏంటో తన ఆట ద్వారా చూపించటం కేవలం సచిన్ కు మాత్రమే సాధ్యం. టెస్టులలోనైనా, వన్డేలలోనైనా అతి ఎక్కువ సెంచరీలు చేసిన సచిన్ ను నెర్వస్ నైన్టీ పట్టి పీడించకుంటే మరెన్నో సెంచరీలు ఆయన ఖాతాలో పడేవి. తాజాగా ఆస్ట్రేలియాతో మొహలీలో ఆడిన మొదటి ఇన్నింగ్స్ లో కూడా సచిన్ 98 వద్ద ఔటయ్యాడు. కాగా రెండవ ఇన్నింగ్స్ లో 38కు పెవిలియన్ పట్టాడు.

కాగా, విజయం అందుకుంటుందని భావించిన భారత్ పీకల్లోతు కష్టాల్లో పడింది. కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అనవసరంగా రన్నవుట్ అయ్యాడు. హర్భజన్ సింగ్ కూడా వెంటనే అవుటయ్యాడు 124 పరుగులకు భారత్ ఎనిమిది వికెట్లు కోల్పోయింది. వివియస్ లక్ష్మణ్ ఒక్కడే ఎదురీదుతున్నాడు.
Story first published: Tuesday, November 14, 2017, 10:02 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+