Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

#OnThisDay in 2003: సచిన్ బాదిన సెక్సీయస్ట్ సిక్స్ ఇదే (వీడియో)

SACHIN smashes Andy Caddick for a Six in World Cup 2003

హైదరాబాద్: సచిన్ టెండూల్కర్... క్రికెట్ ప్రపంచానికి పరిచయం అక్కర్లేని పేరు. క్రికెట్‌లో ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. తన క్రికెట్ కెరీర్‌లో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ సాధించిన అనేక రికార్డులను అభిమానులు ట్విట్టర్‌లో #OnThisDay పేరిట పోస్టు చేస్తున్న సంగతి తెలిసిందే.

తాజాగా 2003 వరల్డ్ కప్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన ఓ మ్యాచ్‌లో సచిన్ బాదిన సిక్సు క్రికెట్‌లోనే 'సెక్సీయస్ట్ సిక్సు'గా నిలిచింది. ఈ సిక్సుని సచిన్ సరిగ్గా ఇదే రోజున ఫిబ్రవరి 23న బాదడం విశేషం. ఇంగ్లాండ్ బౌలర్ ఆండీ క్యాడిక్ వేసిన బంతిని సచిన్ క్రీజులో నుంచి కదలకుండా బాదిన సిక్స్ స్టేడియం బయట పడింది.

బంతిని వెతికేందుకు కనీసం 5 నిమిషాలు పట్టింది. 2003లో దక్షిణాఫ్రికా ఆతిథ్యం ఇచ్చిన వరల్డ్ కప్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది. డర్బన్‌లోని కింగ్స్‌మీడ్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత జట్టు 82 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా సచిన్ టెండూల్కర్ (50), రాహుల్ ద్రవిడ్ (62) పరుగులతో రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 250 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య చేధనకు దిగిన ఇంగ్లాండ్‌ జట్టు టీమిండియా పేసర్ ఆశిష్ నెహ్రా దెబ్బకు 168 పరుగులకే ఆలౌటైంది. ఈ మ్యాచ్‌లో ఆశిష్ నెహ్రా 6/23తో తన కెరీర్‌లోనే అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలను నమోదు చేశాడు.

Story first published: Monday, February 26, 2018, 13:19 [IST]
Other articles published on Feb 26, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+