సచిన్ సెంచరీ: భారత్ ఘనవిజయం

ఆదివారంనాడు రెండో ఇన్నింగ్స్‌లో కష్టాల్లో పడిన తమ జట్టును ఆదుకున్న స్ట్రాస్, కాలింగ్‌వుడ్‌లు ఆట నాలుగోరోజు అదే ఊపును కొనసాగించారు. పిచ్ పరిస్థితిని ఔపోసన పట్టిన ఈ ఇరువురు ఆటగాళ్లు సెంచరీలతో అదరగొట్టారు. జహీర్ (40/3), ఇషాంత్ (57/3)ల ధాటికి మిగతా బ్యాట్స్‌మెన్ విఫలమైనా ఇంగ్లండ్ 9 వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసి టీ తరువాత కొద్ది సేపటికి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 75 పరుగులతో కలిపి భారత్ ముందు 386 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అయితే భారత్ టాప్ ఆర్డర్‌ను దెబ్బతీయాలని వేసిన పీటర్సన్ డిక్లేర్ పాచిక పారలేదు. సెహ్వాగ్ ( 68 బంతుల్లో 11 బౌండ్రీలు, 4 సిక్సర్లతో 83) విజృంభిండంతో బెడిసి కొట్టింది. ఫలితంగా నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ సెహ్వాగ్ వికెట్ మాత్రమే నష్టపోయి 131 పరుగులు చేసింది.
ఇంగ్లండ్ విసిరిన 386 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు సెహ్వాగ్, గంభీర్ జోడీ కళ్లు చెదిరే ఆరంభాన్నిచ్చింది. ముఖ్యంగా సెహ్వాగ్.. ఆకాశమే హద్దుగా చెలరేగి బౌండ్రీలు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. తొలి ఐదు ఓవర్లలోనే భారత్ 45 పరుగులు చేసిందటే సెహ్వాగ్ ఏ తరహాలో బ్యాటింగ్ చేశాడో తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో దిక్కుతోచనిస్థితిలో పడిన పీటర్సన్... స్పిన్నర్ పనేసర్ చేతికి బంతినిచ్చాడు. అయితే ఈ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్‌ను సిక్సర్‌తో స్వాగతించిన వీరూ... 32 బంతుల్లోనే హాఫ్ సెంచరీని అధిగమించాడు.
మరోవైపు గంభీర్ ఆచితూచి ఆడుతూనే సెహ్వాగ్‌కే బ్యాటింగ్ చేసే అవకాశం కల్పించాడు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ బౌలర్లను ఉతికారేస్తున్న సెహ్వాగ్ సెంచరీ చేయడం లాంఛనమే అనిపించింది. అయితే స్వాన్ విసిరిన బంతిని అడ్డంగా ఆడే ప్రయత్నంలో సెహ్వాగ్ వికెట్ల ముందు దొరికిపోయాడు. దీంతో ఈ ఇరువురి 117 పరుగుల తొలి వికెట్ భాగస్వామానికి తెరపడినట్లయింది. అయితే గంభీర్, ద్రావిడ్‌లు మిగిలిఉన్న కాస్త ఓవర్లలో కుదురుగా బ్యాటింగ్ చేసి మరో వికెట్ పడకుండా జాగ్రత పడ్డారు.
అంతకు ముందు ఓవర్‌నైట్ స్కోరు 3 వికెట్ల నష్టానికి 172 పరుగులతో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్ స్ట్రాస్, కాలింగ్‌వుడ్ సమయోచిత బ్యాటింగ్‌తో భారీస్కోరు దిశగా ఉరకలేసింది. ఈ ఇరువురు భారత బౌలర్లను దీటుగా ఎదుర్కోవడంతో ఇంగ్లండ్ లంచ్ విరామానికి మరో వికెట్ నష్టపోకుండా 244 పరుగులతో పటిష్టంగా కనిపించింది. అయితే లంచ్ తరువాత జహీర్ విజృంభణతో ఇంగ్లండ్ బ్యాటింగ్ గాడి తప్పింది. ఈ దశలో ఇంగ్లండ్ బ్యాటింగ్ ఆర్డర్ త్వరత్వరగా వికెట్లు కోల్పోవడమే కాకుండా లంచ్ తర్వాత జరిగిన 25.5 ఓవర్ల ఆటలో కేవలం 67 పరుగులే చేయగలిగింది.
వికెట్ పడగొట్టడమే గగనంగా మారిన పరిస్థితుల్లో హర్భజన్ స్ట్రాస్ (244 బంతుల్లో 8 ఫోర్లతో 108) వికెట్‌తో ధోనీకి ఊరట కలిగించాడు. భజ్జీ బంతిని డ్రైవ్ చేసే క్రమంలో స్ట్రాస్ షార్ట్ కవర్స్‌లో పొంచి ఉన్న లక్ష్మణ్‌కు చిక్కాడు. స్ట్రాస్ తొలి ఇన్నింగ్స్‌లోనూ సెంచరీ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఫ్లింటాఫ్‌ను ఇషాంత్ త్వరగానే బలిగొన్నా కాలింగ్‌వుడ్ (250 బంతుల్లో 9 బౌండ్రీలతో 108)ను జహీర్ ఎల్బీగా ఔట్ చేయడంతో పీటర్సన్ తమ ఇన్నింగ్స్‌ను మరెంతో సేపు కొనసాగించలేదు.
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 316.
భారత్ తొలి ఇన్నింగ్స్: 241.
ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ 311 /9
Story first published: Tuesday, November 14, 2017, 10:02 [IST]
Other articles published on Nov 14, 2017
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications