ఆ నకిలీ ఖాతాలను తొలగించండి: ట్విట్టర్‌కు సచిన్ విజ్ఞప్తి
హైదరాబాద్: క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ సోషల్ మీడియా వెబ్‌సైట్ ట్విట్టర్‌కు ఓ విజ్ఞప్తి చేశారు. తన కుమార్తె సారా టెండూల్కర్, కుమారుడు అర్జున్ టెండూల్కర్‌ల పేరిట ఉన్న నకిలీ ట్విట్టర్ ఖాతాలను తొలగించాలని ట్విట్టర్ సంస్థను కోరుతూ సోమవారం సచిన్ ట్వీట్ చేశారు.
సచిన్ చేసిన ఈ ట్వీట్ కొన్ని క్షణాల్లోనే వైరల్‌గా మారింది. తన కుమార్తె, కుమారుడికి ట్విట్టర్‌లో ఖాతాలు లేవని.. వీలైనంత త్వరగా వారి పేర్లమీద ఉన్న అన్ని ఖాతాలను తొలగించాలని సచిన్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. అర్జున్, సారాల పేర్లతో ఉన్న నకిలీ ఖాతాల నుంచి తప్పుడు సమాచారం పోస్ట్ అయితే పరిస్థితి వేరేలా ఉంటుందని సచిన్ అభిప్రాయపడ్డారు.

సాధ్యమైనంత త్వరగా ట్విట్టర్ సంస్ధ సరైన చర్యలు తీసుకోవాలని సచిన్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. గతంలో 2014లో సచిన్ ఇదే విషయంపై ట్వీట్ చేశారు. సారా, అర్జున్ ట్విట్టర్‌లో లేరని, వారి పేర్లతో ఉన్న నకిలీ ట్విట్టర్ ఖాతాలను నమ్మొద్దని చేసిన పోస్టును తాజా ట్వీట్‌లో జత చేశారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications