
హైదరాబాద్: సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్ తన ఫాస్ట్ బౌలింగ్‌లో ఉన్న సీక్రెట్‌ను బయటపెట్టాడు. తన తండ్రి అడుగుజాడల్లో బ్యాట్స్‌మెన్‌గా ఎదగడం చాలా తేలికైనప్పటికీ అర్జున్ తను కొత్త దారిని ఎంచుకున్నాడు. ప్రస్తుతం క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా తరపున ఆస్ట్రేలియాలో టీ20 టోర్నమెంట్‌లో ఆడుతున్నాడు. ఈ టోర్నమెంట్‌లో అర్జున్ ఆటతీరును చూసిన ఆస్ట్రేలియా మీడియా 'డార్లింగ్ ఆఫ్ ద టోర్నమెంట్'గా పేర్కొంది.
పద్దెనిమిదేళ్ల అర్జున్ ఇంతకుముందు మ్యాచ్‌లో బౌలింగ్ ప్రతిభను చూపించి నాలుగు వికెట్లను తీయగలిగాడు. అంతేగాక 27బంతులలో 48పరుగులను తీసి అక్కడి మీడియా కంట్లో పడ్డాడు. 'ఫేస్ బౌలర్‌గా మారడం గురించి మీడియా అడిగిన ప్రశ్నలకు బదులిచ్చిన అర్జున్.. నాకు చిన్నతనం నుంచి బౌలింగ్ అంటే ఇష్టం. అప్పట్లో అనుకునే వాడ్ని. భారత జట్టులో బౌలర్లు తక్కువగా ఉన్నారు. ఆ స్థానాన్ని భర్తీ చేయాలని.'అని పేర్కొన్నాడు.
ఇంకా మాట్లాడుతూ, "నాకు ఇంత మెరుగ్గా బౌలింగ్ రావడానికి కారణం వసీం అక్రమ్, జహీర్‌ఖాన్‌లే. నాకు వసీం అక్రం బౌలింగ్‌లోని మెలకువలను నేర్పాడు. బంతి పట్టుకునే పద్ధతిని, విసిరే శైలిని నేర్పాడు. ఇంకా నాది ఎడమ చేతి వాటం కాబట్టి దాంతో కూడా కుడి చేతి బ్యాట్స్‌మెన్‌కి ఎలా వేయాలో కూడా నేర్పాడు."
అర్జున్‌కు నేర్చుకోవాలనే ఉత్కంఠను అతనికి ఉన్న కుతూహలం భారత్, శ్రీలంక, పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లలో క్రికెట్‌పై ఇంతటి ఆసక్తి ఉన్న క్రీడాకారుడ్ని చూడలేదంటూ వసీం అక్రమ్ ఓ మీడియా సమావేశంలో తెలిపాడు. ఇంకా బౌలింగ్‌లోని మెలకువలను నేర్చుకోవడానికి చాలా ఆసక్తి ప్రదర్శిస్తున్నట్లు పేర్కొన్నాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.