సచిన్ సినిమాకి ఆసీస్ నటుడి ప్రచారం: థ్యాంక్స్ చెప్పిన మాస్టర్
హైదరాబాద్: క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం 'సచిన్- ఏ బిలియన్ డ్రీమ్స్'. ఈ చిత్రంలో సచిన్ టెండూల్కర్ పాత్రలో తానే స్వయంగా నటించారు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 2017 మే 26న ఈ సినిమా విడుదల కానున్న సంగతి తెలిసందే.
ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాలోని క్రికెట్, సచిన్ అభిమానులు 'సచిన్- ఏ బిలియన్ డ్రీమ్స్' సినిమా కోసం ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ ప్రచార కార్యక్రమంలో ఆస్ట్రేలియా నటుడు మనూ సింగ్‌తో పాటు అభిమానులు సచిన్ చిత్రానికి సంబంధించి కొన్ని పోస్టర్లను ఆవిష్కరించారు.
'ఈ సందర్భంగా 26-5-17న విడుదల కానున్న 'సచిన్-ఏ బిలియన్ డ్రీమ్స్' చిత్రానికి ప్రచారం నిర్వహించడం ఎంతో గర్వంగా ఉంది, అందరూ తప్పక చూడండి' అని మనూ సింగ్ తన ట్విట్టర్‌లో పోస్టర్లతో కూడిన ట్వీట్ చేశారు.
కాగా, మనూ సింగ్ నిర్వహిస్తున్న ప్రచారం గురించి తెలుసుకున్న సచిన్ తన ట్విట్టర్‌లో స్పదించారు. తనపై ఇంత అభిమానం, ప్రేమ చూపుతున్న అందరికీ ధన్యవాదాలు అంటూ సచిన్ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications