Sourav Ganguly 50th Birthday : దాదా హయాంలోనే వాళ్లందరూ పైకొచ్చారు : సచిన్ వ్యాఖ్యలు

భారత మాజీ కెప్టెన్, ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తన 50వ పుట్టినరోజు శుక్రవారం (జులై 8)న జరుపుకోబోతున్నాడు. ఈ సందర్భంగా భారత కెప్టెన్‌గా సౌరవ్ గంగూలీ పదవీకాలంపై సచిన్ టెండూల్కర్ ప్రశంసల జల్లు కురిపించాడు. గంగూలీ భారత కెప్టెన్‌గా విజయవంతమయ్యాడని, అతను ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడని, అతని అయిదేళ్ల పదవీ కాలంలో భారత క్రికెట్ దశ దిశా ఎంతో మారిందని పేర్కొన్నాడు. ఇక గంగూలీ హయాంలో అతను ఇంగ్లాండ్‌లో ప్రసిద్ధ 2002నాట్‌వెస్ట్ సిరీస్ గెలిచిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత 2003 ప్రపంచకప్‌లో జట్టును ఫైనల్ వరకు తీసుకెళ్లాడు. ఇక టెండూల్కర్, గంగూలీ ఎన్నో మ్యాచుల్లో టీమిండియా తరఫున ఓపెనర్లుగా బరిలోకి దిగారు.

ఎలా మెయింటెయిన్ చేయాలో తెలుసు..!
ఇక సచిన్, గంగూలీ, రాజీవ్ శుక్లా తదితరులు ఈరోజు ముందస్తు బర్త్ డే పార్టీ చేసుకున్నారు. సచిన్ మాట్లాడుతూ.. భారత క్రికెట్ దిగ్గజం గంగూలీ గొప్ప సారథి అని, ఆటగాళ్లతో ఎలా బ్యాలెన్స్ మెయింటెయిన్ చేయాలో అతనికి తెలుసునని చెప్పాడు. గంగూలీ కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించినప్పుడు.. భారత జట్టు పరివర్తన దశలో ఉందన్నాడు. 'సౌరవ్ గొప్ప కెప్టెన్. ఆటగాళ్లకు స్వేచ్ఛ ఇవ్వడం, వారికి బాధ్యతలు ఇవ్వడం, ప్లేయర్లతో బ్యాలెన్స్ మెయింటెన్ చేయడం అతనికి బాగా తెలుసు. అతను బాధ్యతలు స్వీకరించినప్పుడు.. భారత క్రికెట్ ఓ కీలక దశలో ఉంది. ఇండియా టీంకు భావి ప్లేయర్లు కావాల్సిన తరుణమది. ఆ టైంలో భారత్‌ను సరైన పథంలో గంగూలీ నడిపించాడు.' అని టెండూల్కర్ అన్నారు.

వాళ్లందరికీ గంగూలీ సపోర్ట్
గంగూలీ.. అప్పుడప్పుడే టీంలోకి అరంగేట్రం చేసిన ఆటగాళ్లకు అవసరమైన సహాయాన్ని అందించేవాడని, వారు తమ భావాలను వ్యక్తీకరించే స్వేచ్ఛను వారికి ఇచ్చేవాడని సచిన్ తెలిపాడు. 'ఇక గంగూలీ కెప్టెన్‌గా ఉన్న టైంలో టీమిండియాకు కొందరు అగ్రశ్రేణి ఆటగాళ్లు తయారయ్యారు. వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్, జహీర్ ఖాన్, హర్భజన్ సింగ్, ఆశిష్ నెహ్రా లాంటి కొందరు దిగ్గజ ప్లేయర్లు గంగూలీ హయాంలో రూపొందినవారే. వారు చాలా ప్రతిభావంతులైన ఆటగాళ్లు. కానీ ఎంత ప్రతిభావంతుడైనా తమ కెరీర్ ప్రారంభంలో వారికి మద్దతు అవసరం. సౌరవ్ గంగూలీ వారికి ఆ సపోర్ట్ ఇవ్వగలిగాడు. అలాగే జట్టులో వారి రోల్స్ ఏంటో అవగాహన పరిచేవాడు. వాళ్లు తమ భావాలను గంగూలీతో స్వేచ్ఛగా చెప్పుకునే వీలు కల్పించాడు. తద్వారా వారు తమను తాము రూపొందించుకునే వేదికను ఏర్పాటు చేశాడు.' అని టెండూల్కర్ చెప్పాడు.

గంగూలీ కెరీర్
గంగూలీ అంతర్జాతీయ క్రికెట్‌లో 113 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి 42సగటుతో 7212 పరుగులు చేశాడు. ఇందులో 35 హాఫ్ సెంచరీలు, 16 సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోర్ 239పరుగులు. 311 వన్డే మ్యాచ్‌లు ఆడిన గంగూలీ 41 సగటుతో 11,363 పరుగులు చేశాడు. ఇందులో 22 సెంచరీలు, 72 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోర్ 183 పరుగులు. గంగూలీ కెప్టెన్‌గానూ మంచి పేరు తెచ్చుకున్నాడు. భారత జట్టును ఎన్నో మ్యాచ్‌లు గెలిపించాడు. ఇక ఐపీఎల్‌లో 59 మ్యాచ్‌లు ఆడిన గంగూలీ 25 సగటుతో 1349 పరుగులు చేశాడు. ఇందులో 7 హాఫ్ సెంచరీలు ఉండగా.. అత్యధిక స్కోర్ 91 పరుగులు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications