Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సచిన్ నా హీరో, బౌలింగ్ చేయాలని ఉందని అడిగా: బ్లేక్

Yohan Blake
న్యూఢిల్లీ: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ వినయం, అందరి మనసులను తాకిందని జమైకా పరుగుల వీరుడు యోహాన్ బ్లేక్ అన్నాడు. ప్రపంచంలో అత్యంత మేటి క్రికెటర్‌గా ఖ్యాతిని ఆర్జించిన తన చిన్ననాటి హీరో కోట్లాది మంది అభిమానుల హృదయాలను కొల్లగొట్టాడని, లెజెండరీ బ్యాట్స్‌మన్‌గా క్రీడా ప్రపంచానికి అందించిన వారసత్వం కేవలం క్రీడాకారులకు మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరికీ అనుసరణీయమేనని బ్లేక్ కొనియాడాడు.

బాల్యం నుంచే తాను సచిన్‌ను హీరోగా ఆరాధించేవాడినని, క్రికెట్‌లో ఎన్నో రికార్డులు నెలకొల్పి ఎదురులేని బ్యాట్స్‌మన్‌గా చరిత్రకు ఎక్కడంతో పాటు దేశ సరిహద్దులకు అతీతంగా కోట్లాది మంది అభిమానులకు పాత్రుడైన సచిన్ గురించి మాట్లాడే అదృష్టం కలగడాన్ని ఎంతో గొప్ప గౌరవంగా భావిస్తున్నానని తెలిపాడు.

సచిన్ తన 24 ఏళ్ల సుదీర్ఘ క్రీడా ప్రస్థానంలో ఎటువంటి వివాదాలకు తావులేకుండా ఎంతో గౌరవ ప్రదంగా కెరీర్‌ను కొనసాగించడం అబ్బురపరుస్తోందని చెప్పాడు. ఎంతో నిరాడంబరుడైన సచిన్ ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్నాడని, క్రీడా ప్రపంచానికి సచిన్ అందించిన వారసత్వం ఎంతో విశిష్టమైనదని, ఇది కేవలం క్రీడాకారులకు మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరికీ అనుసరణీయమే అని పిటిఐ వార్తా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కొనాయాడాడు.

సచిన్‌కు కనీసం ఒక్కసారైనా బౌలింగ్ చేయాలన్నది బ్లేక్ చిరకాల స్వప్నం. సచిన్‌తో తొలిసారి మాట్లాడే అవకాశం లభించినప్పుడు మీకు బౌలింగ్ చేయాలని ఉంది అని ఆయనతో చెప్పానని, ఆ విషయాన్ని తాను ఇప్పటికీ మరువలేదన్నాడు. బాల్యంలో తాను నిజమైన హీరోలుగా ఆరాధించిన వారిలో సచిన్ ఒకరని, అందుకు ఎంతో గర్వపడుతున్నానని, సచిన్ గురించి మాట్లాడే అవకాశం లభించడాన్ని గొప్ప గౌరవంగా భావిస్తున్నానని చెప్పాడు.

తన ఆరాధ్య ఆటగాడు సచిన్ అని, అతనిని చూస్తు పెరిగానని ఇంగ్లాండ్ బ్యాట్సుమెన్ ఇయాన్ బెల్ చెప్పాడు. సచిన్ తన చిన్న నాటి హీరో అని, తాను తొలిసారి అతనితో ఆడే సమయానికి సచిన్ 15 ఏళ్ల కెరీర్ పూర్తి చేసుకున్నాడని, అలాంటి ఆటగాడితో ఆడటం గౌరవంగా భావిస్తున్నానన్నాడు. మరో సచిన్ వస్తాడనుకోనని చెప్పాడు. సచిన్ లేకపోవడం క్రికెట్‌కు తీరని లోటు అన్నాడు.

Story first published: Tuesday, November 14, 2017, 10:02 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+