Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Sachin Tendulkar : వరల్డ్ కప్ గెలిచిన స్టేడియంలో.. సచిన్ స్టాచ్యూ!

Sachin life size statue to be erected in Wankhede

క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్‌కు అరుదైన గౌరవం ఇవ్వాలని ముంబై క్రికెట్ అసోసియేషన్ నిర్ణయించుకుంది. అందుకే ఇక్కడి వాంఖడే స్టేడియంలో సచిన్ నిలువెత్తు విగ్రహాన్ని ఏర్పాటు చేయనుంది. ఏప్రిల్ 24న సచిన్ 50 జన్మదినం జరుపుకోనున్నాడు. దీనికి సరిగ్గా ఒక్క రోజు ముందు ఈ విగ్రహాన్ని ఆవిష్కరించాలని ఎంసీఏ అధికారులు అనుకుంటున్నారు. భారత క్రికెట్‌కు ఎనలేని సేవ చేసిన సచిన్‌కు కృతజ్ఞతగా ఈ విగ్రహం ఏర్పాటు చేస్తున్నామని వాళ్లు తెలిపారు.

ఉడతా భక్తి అంతే..

ఉడతా భక్తి అంతే..

దీనికి సచిన్ కూడా అంగీకారం తెలిపాడని, ఇదే వాంఖడే స్టేడియంలో పెడుతున్న తొలి విగ్రహమని చెప్పారు. ఈ విగ్రహాన్ని ఎక్కడ ఏర్పాటు చేయాలనే విషయంపై ఇంకా ఒక నిర్ణయానికి రాలేదని ఎంసీఏ ప్రెసిడెంట్ అమోల్ కాలే తెలిపారు. 'సచిన్ ఒక భారత రత్న అందుకున్న క్రీడాకారుడు.

క్రికెట్‌కు అతను ఏం చేశాడో అందరికీ తెలుసు. అటువంటి మనిషి 50వ పడిలో పడుతున్నాడు. అందుకే ఉడతా భక్తిగా ఆయన్ను ఇలా గౌరవించుకోవాలని అనుకున్నాం. కొన్ని వారాల క్రితం ఇదే మాటను సచిన్ చెవిన కూడా వేసి, విగ్రహం ఏర్పాటుకు ఒప్పించాం' అని కాలే వెల్లడించారు.

సచిన్‌తో అనుబంధం..

వాంఖడే స్టేడియంలో ఇప్పటికే సచిన్ టెండూల్కర్ స్టాండ్ ఉంది. ఇక్కడే సచిన్ తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. అంతేకాదు, 2011లో వన్డే వరల్డ్ కప్ నెగ్గి తన చిరకాల వాంఛను సచిన్ పూర్తిచేసుకుంది కూడా ఇక్కడే. ఇలా సచిన్ కెరీర్‌లో ఎన్నో మరచిపోలేని ఘటనలకు సాక్షిగా నిలిచిన వాంఖడే స్టేడియంలో ఇప్పుడు ఇక్కడ అతని నిలువెత్తు విగ్రహం కూడా ఏర్పాటు చేస్తుండటం గమనార్హం. దేశంలో ఇలాంటి విగ్రహాలు చాలా అరుదుగానే ఏర్పాటు చేయడం జరిగింది.

సెంచరీల రారాజు..

నాగ్‌పూర్‌లోని వీసీఏ స్టేడియం, ఆంధ్రలోని వీడీసీఏ స్టేడియం, ఇండోర్‌లోని హోల్కార్ స్టేడియాల్లో మాజీ లెజెండ్ సీకే నాయుడు విగ్రహం ఉంది. ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలోనే ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య మూడో టెస్టు జరగనుంది. కాగా, టెండూల్కర్ తన కెరీర్‌లో 200 టెస్టు మ్యాచులు, 463 వన్డేలు ఆడాడు.

ఈ రెండు ఫార్మాట్లలో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. అంతేకాదు, క్రికెట్ చరిత్రలో 100 అంతర్జాతీయ శతకాలు బాదిన ఏకైక ఆటగాడిగా కూడా రికార్డు సృష్టించాడు. సచిన్ తన కెరీర్‌లో సాధించిన ఎన్నో రికార్డులు ఇప్పటికీ బద్దలు కాలేదు. వీటిలో 100 శతకాలు కూడా ఒకటి.

Story first published: Tuesday, February 28, 2023, 12:54 [IST]
Other articles published on Feb 28, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+