Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇప్పటికే సచినే నాకు స్ఫూర్తి: మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రవిడ్

Rahul Dravid
కింగ్‌స్టన్‌ (జమైకా): 15 ఏళ్ళ సుదీర్ఘ అనుభవం, టెస్ట్‌ క్రికెట్‌లో టన్నుల కొద్ది పరుగులు, ప్రపంచ మూడో అత్యుత్తమ టెస్ట్‌ పరుగుల వీరుడు, 150 టెస్టులు 31 సెంచరీలు.. ఇన్ని అత్యుత్తమ గణాంకాలు ఎవరివో కాదు.. మిస్టర్‌ డిపెండెబుల్‌, ది వాల్‌ గా పేరుగాంచిన రాహుల్‌ ద్రావిడ్‌వి. ఇప్పటికీ తన ఆటలో పస తగ్గని ద్రావిడ్‌ ఎందరో యువ క్రికెటర్లకు స్ఫూర్తిదాయకంగా నిలిచాడు. అయినా.. తనకు ఇప్పటికీ స్ఫూర్తినిస్తున్నది ఎవరో తెలుసా? తనతో కలిసి 19 టెస్ట్‌ సెంచరీల్లో పాలుపంచు కున్న మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌. క్రికెట్‌లో ఎంతో ఎత్తుకు ఎదిగినా.. తనకు స్ఫూ ర్తి సచినే అంటున్నాడు రాహుల్‌ ద్రావిడ్‌.

150 టెస్టుల్లో 52.44 సగటుతో 12,063 పరుగులు చేసి అత్యధిక టెస్ట్‌ పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌ జాబితాలో సచిన్‌, పాంటింగ్‌ తరువాత మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. ద్రవిడ్‌ తన టెస్ట్‌ కెరీర్‌లో ఇప్పటివరకు 31 సెంచరీలు, 59 అర్ధసెంచరీలు చేశాడు. అంతేకాకుండా 5 డబుల్‌ సెంచరీలు చేశాడు. అత్యుత్తమ స్కోరు 270. రెండో స్థానా నికి పాంటింగ్‌ కంటే.. కేవలం 300 పరుగులు వెనకబడి ఉన్నాడు. ఇన్ని సాధించినా.. ఎంతో సాధారణంగా కనిపించే ద్రావిడ్‌.. కెరీర్‌లో మరింత దూసుకుపోవాలని తహతహలా డుతుంటాడు. ''టెస్ట్‌ మ్యాచ్‌లో బ్యాట్‌ పట్టక ఏడు నెలలవు తుంది. అయినా.. ఈ ఏడు టెస్ట్‌ (విండీస్‌తో 3, ఇంగ్లాండ్‌తో 4) లకు పూర్తి సన్నద్ధంగా ఉన్నాను. ఎంత సాధించినా.. ప్రతి మ్యాచ్‌ నాకు కొత్తగానే ఉంటుంది. ఒత్తిడి అనేది ప్రతి మ్యాచ్‌లోనూ ఉం టుంది. ఇవన్నీ తట్టుకొని అత్యు త్తమ ఆటతీరు ప్రదర్శించాలని అనుకుంటున్నాను"" అని ద్రావిడ్‌ అన్నాడు.

ఇక టీమిండియా కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనిని ద్రావిడ్‌ పొగడ్తలతో ముంచెత్తాడు. వన్డే, ట్వంటీ20, టెస్ట్‌ ఇలా అన్ని ఫార్మాట్లకు సరిపోయే గొప్ప కెప్టెన్‌గా ధోనిని వర్ణించాడు. ''నేను ఆడినటువంటి గొప్పకెప్టెన్లలో ధోని ఒకడు. కెప్టెన్‌గా టీమిండియాను విజయవంతంగా నడిపిస్తున్నాడు. టెస్టులు, ఐపీఎల్‌, వన్డే క్రికెట్‌ ఇలా ఏ ఫార్మాటైనా కాని ధోని కెప్టెన్సీయే నెంబర్1 అని ధోనిని పొగడ్తలతో ముంచెత్తాడు ద్రావిడ్‌.
Story first published: Tuesday, November 14, 2017, 10:02 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+