సచిన్ ఓ దిగ్గజం, కోహ్లీని పోల్చడమేంటి?: కపిల్
కోల్‌కతా: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌తో స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీని పోల్చడం సమంజసం కాదని మాజీ కెప్టెన్ కపిల్‌దేవ్ అన్నాడు. కోహ్లి కెరీర్ ఆరంభ దశలోనే ఉన్నాడని.. ఇప్పుడే అతణ్ని సచిన్‌తో పోలిస్తే పొరపాటవుతుందని పేర్కొన్నాడు.
'అసలు పోల్చాల్సిన అవసరమేముంది. సచిన్ ఓ దిగ్గజం. విరాట్ కెరీర్ ఇప్పుడిప్పుడే మొదలైంది. ఆ ఇద్దర్నీ పోల్చిచూడటం సరికాదన్నది నా అభిప్రాయం' అని కపిల్ అన్నాడు.

కెప్టెన్సీ మార్పు గురించి సెలెక్టర్లు చూసుకుంటారని కపిల్ చెప్పాడు. 'చాలాసార్లు ధోని దేశాన్ని గర్వించేలా చేశాడు. కెప్టెన్సీ మార్పు విషయం సెలెక్లర్లకే వదిలేయాలి. అవసరమని భావించినప్పుడు వాళ్లే మార్పు చేస్తారు' అని అన్నాడు.
వరల్డ్ టీ20లో టీమిండియా మెరుగైన ప్రదర్శన చేసింది. కానీ తమదైన రోజు ప్రత్యర్థులు చెలరేగారన్నాడు. క్రికెట్‌ను పొట్టి ఫార్మాట్ ఎంతో ఉత్కంఠ భరితంగా మార్చిందని కపిల్ అభిప్రాయపడ్డాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications