అనుభవంతో సచిన్ చేసిన సూచనని తిరస్కరిస్తారా..?

ఈ సందర్బంలో శ్రీలంక ఫాస్ట్ బౌలర్ మలింగా మాట్లాడుతూ ఎంతో అనుభవంతో సచిన్ చేసిన సూచన చాలా ఆసక్తికరంగా ఉందని, కానీ ఐసిసి వాటిని ఎందుకు తిరస్కరించిందో తనకు తెలియడం లేదని అన్నారు. ప్రస్తుతమున్న పరిస్థితిలోనైతే ఒక బౌలర్‌గా 34వ ఓవర్‌లో బాల్ మార్చడానికి తాను వ్యతిరేకమని అన్నాడు. సచిన్ సిఫార్సులను అమలు చేస్తే బంతిని ఎక్కువసార్లు మార్చవచ్చని, ఫలితంగా రివర్స్‌స్వింగ్‌తో బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెడతానికి అవకాశముంటుందన్నాడు.
ఇక శుక్రవారం నుండి బెంగళూరులో జరగనున్న ఛాంపియన్స్ లీగ్ టి20 మ్యాచ్ బెంగళూరు రాయల్ ఛాలంజెర్స్, వారియర్స్‌కి జరగనుంది. చాంపియన్స్ లీగ్ ట్వంటీ-20 టోర్నమెంట్‌లో ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ ఐదుగురు విదేశీ ఆటగాళ్లతో బరిలోకి దిగనుంది.సాధారణంగా ఛాంపియన్స్ లీగ్ టి20లో ఒక జట్టు తరపున నలుగురు విదేశీ ఆటగాళ్లు మాత్రమే ఆడేందుకు అనుమతి ఉంటుంది. అయితే కీలక ఆటగాళ్లు సచిన్, రోహిత్ శర్మ, మునాఫ్ పటేల్, ధావల్ కులకర్ణి తదితరులు గాయం బారీన పడడంతో చాంపియన్స్ లీగ్ పాలక మండలి ఐదుగురు విదేశీ ఆటగాళ్లను బరిలోకి దించేందుకు ముంబైకి అనుమతి ఇచ్చింది.
దీంతో చాంపియన్స్ లీగ్ ముంబై ఐదుగురు విదేశీ ఆటగాళ్లను ఆడించనుంది. కాగా, గాయాల వల్ల కెప్టెన్ సచిన్‌తోపాటు రోహిత్ శర్మ, అలీ ముర్తుజా, మునాఫ్, కులకర్ణి, సూర్యకుమార్ యాదవ్ టోర్నీ నుంచి తప్పుకున్నారు. వీరి స్థానంలో సైమండ్స్, దిల్హారా ఫెర్నాండో, ఆర్.సతీష్, సరుల్ కుమార్, అబు నెచిమ్, మోజెస్ హెన్రిక్స్ జట్టులోకి వచ్చారు. ఇదిలావుండగా సచిన్ స్దానంలో జట్టులోకి సైమండ్స్ రానున్నాడు.
Story first published: Tuesday, November 14, 2017, 10:02 [IST]
Other articles published on Nov 14, 2017
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications