For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ద్రావిడ్ చెప్పిందోటి, షాకయ్యా: సచిన్, గంగూలీ క్షమాపణ

By Srinivas

ముంబై: ముల్తాన్ టెస్టులో రాహుల్ ద్రావిడ్ డిక్లరేషన్ పైన సచిన్ టెండుల్కర్ తన పుస్తకంలో పేర్కొన్నాడు. ద్రావిడ్ చెప్పిందొకటి చేసిందొకటి ఆవేదన వ్యక్తం చేశాడు. ముల్తాన్ డిక్లరేషన్ తనను తీవ్రంగా బాధించిందని సచిన్ తన పుస్తకంలో రాశాడు. డిక్లరేషన్ ఎందుకు వివాదమైంది, అసలు ఆ టెస్టులో ఏమి జరిగిందన్న విషయాన్ని పుస్తకంలో వివరించాడు.

ద్రావిడ్, సచిన్ చాలా సన్నిహితంగా ఉంటారు. ఇద్దరూ మంచి మిత్రులని అందరికీ తెలుసు. కానీ, ద్రవిడ్‌పై సచిన్ ఆగ్రహించిన సందర్భం కూడా ఉందని ఈ పుస్తకం ద్వారా వెల్లడైంది! పాకిస్తాన్‌తో జరిగిన ముల్తాన్ టెస్టులో తాను డబుల్ సెంచరీకి చేరువైనప్పటికీ ద్రావిడ్ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేయడం తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని సచిన్ పేర్కొన్నాడు.

పాకిస్తాన్‌కు చివరి 15 ఓవర్లు బ్యాటింగ్ చేసే అవకాశాన్నిచ్చి, సాధ్యమైనన్ని వికెట్లు పడగొట్టడం ద్వారా ఒత్తిడి పెంచాలని ముల్తాన్ టెస్టులో స్టాండ్ ఇన్ కెప్టెన్ ద్రవిడ్, కోచ్ జాన్ రైట్ నిర్ణయించారు. నేను క్రీజ్‌లో ఉన్నానని, టీ విరామం ముగిసిన అర గంటకు సబ్‌స్టిట్యూట్ ఆటగాడు రమేష్ పోవార్ మైదానంలోకి వచ్చి, వేగంగా పరుగులు చేయాలని తనకు సూచించాడని చెప్పాడు.

పాకిస్తాన్ ఆటగాళ్లు మైదానం నలుమూలలా ఉన్నప్పుడు వేగంగా పరుగులు సాధించడం ఎలా సాధ్యమని పోవార్‌తో అన్నానని, తాను 194 పరుగుల వద్ద బ్యాటింగ్ చేస్తున్నప్పుడు పోవార్ మరోసారి వచ్చాడని, ఆ ఓవర్ ముగిసిన వెంటనే ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేయాలని ద్రావిడ్ తీర్మానించాడని, కాబట్టి వెంటనే డబుల్ సెంచరీ పూర్తి చేయాలని సూచించాడని పేర్కొన్నాడు.

Sachin Had Fumed When Rahul Dravid Declared in Multan, Reveals Book

ఆ ఓవర్‌లో ఒక్క బంతిని కూడా ఎదుర్కోనే అవకాశం తనకు లభించలేదని, ఇమ్రాన్ ఫర్హాత్ బౌలింగ్‌లోని మొదటి రెండు బంతులను యువరాజ్ సింగ్ డిఫెన్స్ ఆడాడని, మూడో బంతిలో రెండు పరుగులు చేశాడని, నాలుగో బంతిని మళ్లీ రక్షణాత్మకంగా ఆడాడని, ఐదో బంతికి అవుటయ్యాడని పేర్కొన్నాడు.

తర్వాతి బ్యాట్స్‌మన్ పార్థీవ్ పటేల్ ప్యాడ్స్‌తో మైదానంలోకి అడుగుపెట్టాడడని, అయితే, ద్రావిడ్ అతనిని వెనక్కు రావాల్సిందిగా సూచిస్తూ, ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసినట్టు ప్రకటించాడని, ఫలితంగా డబుల్ సెంచరీ పూర్తికాలేదని వివరించాడు. మ్యాచ్ నాలుగో రోజు ఇలాంటి నిర్ణయం తీసుకుంటే మరో విధంగా ఉండేదని, కానీ రెండో రోజు ఆటలోనే తొందరపడడం ఎందుకో తనకు అర్థం కాలేదన్నాడు.

ఆ తర్వాత ద్రావిడ్ తనకు వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించాడని, అయితే, కొంతసేపు తనను ఒంటరిగా విడిచిపెట్టమని తాను కోరానని అన్నాడు. తనతోపాటు జట్టులోని మిగతా సభ్యులు కూడా ద్రావిడ్ నిర్ణయంపై విస్మయం ప్రకటించారన్నాడు. ఆ సమయంలో తీవ్రమైన నిరాశకు గురైన విషయం వాస్తవమేనని, కానీ ఆ సంఘటన ద్రావిడ్‌తో తన స్నేహంపై ఎలాంటి ప్రభావం చూపలేదన్నాడు.

డ్రెస్సింగ్ రూంలో పరిస్థితులు గమనిస్తే ద్రావిడ్ నిర్ణయం పైన జట్టు అంతా ఆశ్చర్యపోయిందన్నాడు. నా చర్య కోసం అందరు ఎదురు చూశారని, తాను క్రికెట్ సామాగ్రిని ఒకచోట ఉంచి కూర్చున్నానని, ఆ తర్వాత కోచ్ జాన్ రైట్‌ను ఈ విషయం అడిగితే తన పాత్ర లేదని చెప్పాడని పేర్కొన్నాడు. అనంతరం జాన్ రైట్‌తో చర్చ ముగిశాక.. రెగ్యులర్ సారథి గంగూలీ జరిగిన దానికి క్షమాపణలు చెప్పాడన్నాడు.

ఆ తర్వాత మాజీ సహచరుడు సంజయ్ మంజ్రేకర్ వచ్చి సాహసోపేత నిర్ణయం, భారత్ క్రికెట్‌కు మంజి శకునం అని తన వద్ద వ్యాఖ్యానించడం నిరాశపరిచిందని, అసలు ఏమి జరిగిందో తెలియకుండా మాట్లాడటం సరికాదని అతనితో విభేదించానని తెలిపాడు. డిక్లరేషన్ బాధించిందని ద్రావిడ్‌తోను చెప్పానని తెలిపాడు. జట్టు కోసమే అలా చేస్తున్నానని ద్రావిడ్ అంటే, తాను కూడా జట్టు కోసమే ఆడుతున్నానని చెప్పానని చెప్పాడు.

ముల్తాన్ డిక్లరేషన్ గురించి వివరిస్తూ.. ఆ మ్యాచ్‌కు నెల ముందు జరిగిన టెస్టును సచిన్ గుర్తు చేసుకున్నాడు. సిడ్నీలో నాలుగో రోజు సాయంత్రం ద్రావిడ్, నేను బ్యాటింగ్ చేస్తున్నామని, ఆ మ్యాచ్‌లో అప్పటికే ఆధిక్యం చాలా ఉందని, డిక్లరేషన్ చేద్దామా అంటే, గంగూలీ క్రీజులో ఉన్న మాకు రెండుమూడుసార్లు సందేశాలు పంపించాడని తెలిపాడు.

ఐతే ద్రావిడ్ తన బ్యాటింగును కొనసాగించాడని, సిడ్నీ టెస్టు, ముల్తాన్ టెస్టు పరిస్థితులను పోల్చుకోవచ్చునని చెప్పాడు. ఐతే సిడ్నీ డిక్లరేషన్ కీలకమని, ముల్తాన్ టెస్టులో డిక్లరేషన్‌కు చెప్పిన కారణమే అతడి ఉద్దేశ్యమైతే.. సిడ్నీలోను అలాగే చేయాల్సిందన్నాడు. సిడ్నీ టెస్టులో 400కు పైగా ఆధిక్యమున్నా భారత్ నాలుగో రోజు ఆలస్యంగా డిక్లేర్ చేసిందని, ఆ మ్యాచ్ డ్రాగా ముగిసిందని చాలాసేపు వేచి చూసిన గంగూలీ... ద్రావిడ్ 91 వద్ద ఉన్నప్పుడు డిక్లేర్ చేశాడని చెప్పాడు.

వీకెండ్ సేల్: ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్‌లలో 80% వరకు తగ్గింపు. త్వరపడండి!

Story first published: Tuesday, November 14, 2017, 10:02 [IST]
Other articles published on Nov 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+