Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సచిన్​తో దాదా: ఈ నిబంధనలు అప్పుడు ఉంటే.. మరో 4వేల పరుగులు చేసేవాళ్లం!!

Sachin, Ganguly Joke About Modern Cricket Rules As ICC Praises Incredible Pair

హైదరాబాద్: టీమిండియా క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్​, సౌరవ్ గంగూలీలు వన్డేల్లో అత్యంత విజయవంతమైన జంట అన్న విషయం తెలిసిందే. ఈ జోడీ తమ భాగస్వామ్యంలో 47.55 సగటుతో 8,227 పరుగులు చేసింది. ఈ భాగస్వామ్యాలను కీర్తిస్తూ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) బుధవారం ఓ ట్వీట్ చేసింది. 176 వన్డేల్లో 8,227 పరుగులు జోడించారంటూ ఇద్దరు కలిసి ఉన్న ఫొటోను పోస్ట్ చేసింది.

ఈ నిబంధనలు అప్పుడు ఉండుంటేనా

ఐసీసీ చేసిన ట్వీట్‌పై మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్​ స్పందించాడు. ఇప్పుడున్న ఫీల్డింగ్‌, బౌలింగ్‌ నిబంధనలు అప్పుడుంటే తాము మరిన్ని పరుగులు చేసే వాళ్లమని అన్నాడు. 'ఇది మన అద్భుతమైన జ్ఞాపకాలను గుర్తు చేసింది. నలుగురు ఫీల్డర్లు మాత్రమే రింగ్ బయట ఉండాలని, రెండు కొత్త బంతుల నిబంధనలు అప్పుడు ఉంటే మరెన్ని పరుగులు చేసేవాళ్లమని అనుకుంటున్నావు?' అని ట్వీట్ ద్వారా గంగూలీని సచిన్ అడిగాడు.

మరో 4వేల పరుగులు చేసేవాళ్లం

సచిన్ టెండూల్కర్ ట్వీట్‌పై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పందించాడు. 'మరో నాలుగు వేల పరుగులు, అంతకన్నా ఎక్కువ చేసేవాళ్లం. రెండు కొత్త బంతులంటే.. మ్యాచ్​ తొలి ఓవర్​తో పాటు మిగిలిన 50 ఓవర్లలో కవర్​డ్రైవ్​తో బౌండరీలు బాదినంత బాగుంటుంది' అని దాదా ట్వీట్ చేశాడు. ప్రస్తుతం వన్డేల్లో ఒక్కో ఎండ్ నుంచి ఒక్కో కొత్త బంతిని బౌలర్లు వినియోగిస్తున్న విషయం తెలిసిందే. క్రికెట్ ఆటలో మరే జంట కూడా వన్డేల్లో కనీసం 6 వేల పరుగులు చేయలేదు.

అక్తర్‌ని ట్రోల్ చేసిన ఐసీసీ

అక్తర్‌ని ట్రోల్ చేసిన ఐసీసీ

మరోవైపు ఐసీసీ పాకిస్థాన్ మాజీ పేస్ బౌలర్ షోయబ్ అక్తర్‌ని ట్రోల్ చేసింది. ఓ ప్రముఖ క్రీడా వెబ్‌సైట్ మాజీ, ప్రస్తుత క్రికెటర్లను పోలుస్తూ.. ఒక పోస్ట్ పెట్టింది. ఇందులో షోయబ్ అక్తర్ వర్సెస్ స్టీవ్ స్మిత్ అని పేర్కొంది. అయితే దీనిపై అక్తర్ స్పందించారు. 'ఈ రోజు అయినా మూడు బౌన్సర్లు వేస్తే.. నాలుగో బంతికి స్మిత్ ఔట్ అవుతాడు' అని ట్వీట్ చేసాడు.

అక్తర్‌పై సెటైర్

అక్తర్‌పై సెటైర్

అయితే అక్తర్ ట్వీట్‌పై ఐసీసీ సెటైర్ వేసింది. అమెరికా బాస్కెట్ బాల్ ప్లేయర్ మైఖేల్ జార్డన్ పిక్‌ని పోస్ట్ చేసిన ఐసీసీ.. ఆయన షోయబ్ ట్వీట్ చూసి నవ్వుతునట్లుగా పోస్ట్ చేసింది. అంటే.. స్మిత్ ఔట్ కాడు అని ఐసీసీ ఉద్దేశం. లాక్‌డౌన్ సందర్భంగా ఐసీసీ అప్పటి మధుర స్మృతులను గుర్తుచేస్తున్న విషయం తెలిసిందే. ప్రతిరోజు ఏదో ఒక ఫొటో ట్వీట్ చేసి అభిమానులతో పంచుకుంటుంది.

Story first published: Wednesday, May 13, 2020, 8:45 [IST]
Other articles published on May 13, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+