Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సచిన్ అజేయ సెంచరీ: భారత్ 532

Sachin Tendulkar

సిడ్నీ:మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అజేయంగా 154 పరుగులు చేయడంతో ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో భారత జట్టు తన తొలి ఇన్నింగ్స్ లో 532 పరుగుల భారీ స్కోరును సాధించింది. దీనితో ఆస్ట్రేలియా జట్టు పై భారత్ 69 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. అనంతరం రెండవ ఇన్నింగ్స్ ను ప్రారంభించిన ఆసీస్ జట్టు మూడో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 13 పరుగులు చేసింది.

మూడు వికెట్ల నష్టానికి 216 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో మూడో రోజు తన తొలి ఇన్నింగ్స్ ను కొనసాగించిన సచిన్, గంగూలీ వరుసగా సెంచరీ,అర్థ సెంచరీ సాధించడంతో భారత జట్టు భారీ స్కోరును చేయగలిగింది. ఆసీస్ పై తొలి ఇన్నింగ్స్ స్వల్ప ఆధిక్యాన్ని సాధించింది. 9పరుగుల వ్యక్తిగత ఓవర్ నైట్ స్కోరుతో బ్యాటింగ్ కొనసాగించిన సచిన్ టెండూల్కర్ ఆసీస్ బౌలర్లపై ఆధిక్యాన్ని కనపరుస్తూ టెస్టుల్లో 38వ సెంచరీని నమోదు చేశాడు. ఆసీస్ పై 8వ సెంచరీని సాధించాడు. గంగూలీ(67)తో కలిసి నాల్గవ వికెట్ భాగస్వామ్యంలో 110 పరుగులు జోడించిన సచిన్ ఎనిమిదవ వికెట్ భాగస్వామ్యంలో హర్భజన్ సింగ్(63)తో కలిసి 129 పరుగులు జోడించాడు. అజేయంగా 154 పరుగులు చేసిన సచిన్ టెండూల్కర్ 14 ఫోర్లు, ఒక సిక్స్ తో ఆ స్కోరు చేశాడు. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ యువరాజ్ సింగ్(12), ధోని(2)రాణించనప్పటికీ హర్భజన్ సింగ్ అర్థ సెంచరీతో అద్భుత తోడ్పాటునందించి భారత స్కోరు 500 పరుగుల మైలురాయిని దాటేలా చేశాడు.

ఆసీస్ జట్టు స్కోరుకు ధీటైన సమాధానం ఇవ్వడంతో ఈ టెస్ట్ మ్యాచ్ ఇరు జట్ల రెండవ ఇన్నింగ్స్ ఆటతీరుపైనే ఫలితం ఆదారపడి ఉంటుంది. ఆటకు రెండు రోజులే మిగిలి ఉండడంతో ఫలితాన్ని ఆశించడం అత్యాశే అవుతుందేమో చూడాలి. బౌలర్లు విజృంభిస్తే తప్ప అంచనాలు తారుమారయ్యే పరిస్థితి సిడ్నీ పిచ్ పై కనిపించడంలేదు.
Story first published: Friday, January 4, 2008, 14:44 [IST]
Other articles published on Jan 4, 2008
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+