For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సచిన్ సినిమాకు అవార్డులే అవార్డులు

'Sachin: A Billion Dreams' bags two awards at Tehran International FICTS Festival

హైదరాబాద్: మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ తెందుల్కర్‌ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సినిమా 'సచిన్‌: ఎ బిలియన్‌ డ్రీమ్స్‌'. గత ఏడాది విడుదలైన ఈ సినిమా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయ వేదికపై ఈ సినిమా రెండు అవార్డులను కైవసం చేసుకుంది.

11వ టెహ్రాన్‌ ఇంటర్నేషనల్‌ ఎఫ్‌ఐసీటీఎస్‌ ఫెస్టివల్‌-2018లో బెస్ట్‌ డైరెక్టర్‌, బెస్ట్‌ ఫిల్మ్‌ అవార్డును ఈ సినిమా దక్కించుకుంది. క్రీడలకు సంబంధించిన సినిమాలకు మాత్రమే ఈ ఫెస్టివల్‌లో అవార్డులు ప్రకటిస్తారు. జనవరి 16 నుంచి 18 వరకు ఈ ఫెస్టివల్‌ నిర్వహించారు.

ఏటా క్రీడలు, క్రీడాకారుల జీవిత చరిత్రల ఆధారంగా తెరకెక్కిన సినిమాలకు.. ఒలింపిక్, పారాలింపిక్ కమిటీ, యువజన క్రీడల విభాగం పర్యవేక్షణలో ఇరాన్ ప్రభుత్వం అవార్డులు ఇస్తున్న సంగతి తెలిసిందే.

'ఈ అవార్డు దక్కడం గౌరవంగా భావిస్తున్నా. భారత క్రికెట్ దిగ్గజం జీవిత చరిత్రను చెప్పడంలో నేను పడిన శ్రమకు ఫలితం దక్కింది. ఈ చిత్రానికి అంతర్జాతీయ వేదికపై ఎన్నో ప్రశంసలు దక్కాయి. మాస్టర్‌కు సంబంధించిన భావోద్వేగాలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులకు ఈ చిత్రం ద్వారా చేరడం నాకు ఆనందంగా అనిపించింది. అని ఉత్తమ దర్శకుడి అవార్డు స్వీకరించిన అనంతరం హెల్మర్ జేమ్స్ తెలిపాడు.

'సచిన్‌' సినిమా కోసం అతన్ని, అతని కుటుంబసభ్యులను, సహచర ఆటగాళ్లతో మాట్లాడాను. అలాగే ప్రత్యర్థి జట్ల ఆటగాళ్లతోనూ సచిన్‌ గురించి చర్చించా' అని ఆయన తెలిపారు. బెస్ట్‌ డైరెక్టర్‌ అవార్డును ఎరిక్సన్‌, బెస్ట్‌ ఫిల్మ్‌ అవార్డును నిర్మాత రవి భాగ్‌చంద్క అందుకున్నారు.

సచిన్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం..సచిన్: ఎ బిలియన్ డ్రీమ్స్ కు రెండు అవార్డులు దక్కాయి. ఇరాన్‌లోని తెహ్రాన్‌లో జరిగిన అంతర్జాతీయ ఫిక్ట్స్ ఫెస్ట్‌లో ఈ చిత్ర దర్శకుడు హెల్మర్ జేమ్స్‌కు ఉత్తమ దర్శకుడు అవార్డు దక్కగా..నిర్మాత రవి భాగ్‌చంద్కాకు ఉత్తమ చిత్రం విభాగంలో ప్రత్యేక అవార్డు దక్కింది.

గత ఏడాది మే 26న ఈ సినిమా హిందీ, మరాఠీ, ఇంగ్లిష్‌, తమిళ‌, తెలుగు భాషల్లో విడుదలైంది. వసూళ్లపరంగానూ ఈ చిత్రం ఘన విజయం నమోదు చేసింది.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Wednesday, January 24, 2018, 13:27 [IST]
Other articles published on Jan 24, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+