Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సచిన్, రావులకు భారతరత్న ప్రదానం(లెజండ్ పిక్చర్స్)

న్యూఢిల్లీ: బ్యాటింగ్ దిగ్గజం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్, ప్రముఖ శాస్త్రవేత్త సిఎఎన్ఆర్ రావులకు మంగళవారం దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రదానం చేశారు.

మధ్యాహ్నం రాష్ట్రపతి భవన్లో జరిగిన ఈ పురస్కార కార్యక్రమానికి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ తదితరులు హాజరయ్యారు. సిఎన్ఆర్ రావుకు రసాయన శాస్త్రంలో ఈ పురస్కారం లభించింది.

మరో పక్క కేంద్ర హోంశాఖ సోమవారం భారతరత్నపై మార్గదర్శకాలను జారీ చేసింది. పురస్కార గ్రహీతలు తమ బయోడేటాలు, లెటర్ హెడ్, విజిటింగ్ కార్డుల్లో రాష్ట్రపతి నుంచి భారతరత్న అందుకున్నట్లు లేదా భారతరత్న పురస్కార గ్రహీత అని ప్రస్తావించవచ్చునని స్పష్టం చేసింది.

సచిన్

సచిన్

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్‌కు భారతరత్న పురస్కారాన్ని కేంద్ర ప్రభుత్వం ముందుగా కసరత్తు చేసి ఇవ్వలేదట. కేవలం ఇరవై నాలుగు గంటల్లోనే, అదీ సచిన్ 200వ టెస్టు ఆడిన మరుసటి రోజు ఖరారు చేసిందట.

సచిన్

సచిన్

భారతరత్న అత్యున్నత పురస్కారం. దీనిని సచిన్ టెండుల్కర్‌కు ఇవ్వాలనే వాదన చాలా రోజులుగా ఉంది. సచిన్ పేరును భారతరత్నకు అనుకున్నప్పుడల్లా ధ్యాన్ చంద్ వంటి పేర్లు కూడా వినిపించాయి.

సచిన్

సచిన్

గత ఏడాది సచిన్‌కు భారతరత్న పురస్కారం ఇస్తున్నట్లు ప్రకటించారు. సచిన్‌కు భారతరత్న కేంద్రం ముందుగా ఆలోచించి, కసరత్తు చేసి ఖరారు చేయలేదని సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) ద్వారా వెలుగు చూసింది.

 సచిన్

సచిన్

నవంబర్ 14న సచిన్ ముంబై వాంఖెడే స్టేడియంలో చివరి టెస్టు మ్యాచ్ ఆడుతున్నాడు. ఆ సమయంలో సచిన్ వివరాలు పంపాలని ప్రధానమంత్రి కార్యాలయం క్రీడా శాఖను అదే రోజు మధ్యాహ్నం 1.35 నిమిషాలకు కోరింది.

 సచిన్

సచిన్

అక్కడి నుండి వివరాలు సాయంత్రం 5.22 నిమిషాలకు ప్రధానమంత్రి కార్యాలయానికి చేరుకున్నాయి. మరుసటి రోజు అంటే నవంబర్ 15న ప్రధాని దానికి ఓకే చెప్పారు. వెంటనే సచిన్ పేరును భారతరత్నకు సిఫార్సు చేస్తూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ఫైలును పంపించారు.

Story first published: Tuesday, November 14, 2017, 10:02 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+