ముంబయి: శ్రీలంకతో జరిగే ఐదు క్రికెట్ మ్యాచుల సిరీస్ కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) గురువారం 16 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేసింది. సీనియర్లు సచిన్ టెండూల్కర్, జహీర్ ఖాన్ లకు జట్టులో చోటు దక్కింది. ఇషాంత్ శర్మకు విశ్రాంతినిచ్చారు. ఇషాంత్ స్థానంలో మునాఫ్ పటేల్ ను జట్టులోకి తీసుకున్నారు. హైదరాబాదుకు చెందిన స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజాకు జట్టులో స్థానం దక్కింది. చాంపియన్స్ ట్రోఫీకి కూడా దాదాపుగా ఇదే జట్టు కొనసాగుతుంది. చాంపియన్స్ ట్రోఫీలో మునాఫ్ స్థానంలో ఇషాంత్ శర్మ వస్తాడు. పార్థివ్ పటేల్ పై వేటు వేశారు.
జట్టు: మహేంద్ర సింగ్ ధోనీ, వీరేంద్ర సెహ్వాగ్, గౌతం గంభీర్, సచిన్ టెండూల్కర్, యువరాజ్ సింగ్, సురేష్ రైనా, రోహిత్ శర్మ, హర్భజన్ సింగ్, ప్రజ్ఞాన్ ఓజా, ఆర్పీ సింగ్, మునాఫ్ పటేల్, పార్థివ్ పటేల్, జహీర్ ఖాన్, ఇర్ఫాన్ పఠాన్, విరాట్ కోహ్లీ, ప్రవీణ్ కుమార్.