Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

16 ఏళ్ల 205 రోజులు: సచిన్, మిథాలీ జీవితంలో జరిగిన అదే అద్భుతం!

Mithali Raj Birthday: భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, ప్రపంచంలో అత్యధిక వన్డే పరుగులు చేసిన మహిళా బ్యాటర్ అయిన మిథాలీ రాజ్ నేడు(డిసెంబర్ 3) తన 43వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. భారత క్రికెట్ క్వీన్‌గా పేరొందిన మిథాలీ పేరున ఎన్నో మహిళా క్రికెట్ రికార్డులు నమోదై ఉన్నాయి. సరిగ్గా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రికార్డుల పుస్తకాన్ని నింపినట్టే.

సచిన్, మిథాలీ మధ్య ప్రత్యేక అనుబంధం
వన్డే క్రికెట్లో అత్యధిక అంతర్జాతీయ పరుగులు చేసిన రికార్డు ఇద్దరి పేరున ఉన్నప్పటికీ.. వీరిద్దరి మధ్య అంతకుమించి ఓ ప్రత్యేక అనుబంధం ఉంది. ఈ అనుబంధం వారి అంతర్జాతీయ అరంగేట్రంతో ముడిపడి ఉంది. అరంగేట్రం నాటికి వారిద్దరిది ఒకే వయస్సు కావడం గమనార్హం. క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్, క్రికెట్ క్వీన్ మిథాలీ రాజ్.. వీరిద్దరూ తమ అంతర్జాతీయ అరంగేట్రం మ్యాచ్ నాటికి సరిగ్గా ఒకే వయస్సు కలిగి ఉండటం ఒక అద్భుతమైన యాదృచ్ఛికం. 1989లో పాకిస్తాన్‌పై కరాచీ టెస్టుతో అంతర్జాతీయ అరంగేట్రం చేశారు. ఆ టెస్టులో సచిన్ వయస్సు 16 సంవత్సరాల 205 రోజులు. సచిన్ అరంగేట్రం చేసిన సరిగ్గా 10 సంవత్సరాల తర్వాత మిథాలీ 1999లో ఐర్లాండ్‌పై మిల్టన్ కెన్నస్‌లో తన మొదటి వన్డే మ్యాచ్ ఆడారు. ఆ రోజు మిథాలీ వయస్సు కూడా సరిగ్గా 16 సంవత్సరాల 205 రోజులు.

Sachin and Mithali The Amazing 16 Years 205 Days Coincidence Mithali Raj Birthday Special

అరంగేట్రంలోనే రికార్డులు
మిథాలీ రాజ్ తన అరంగేట్రం మ్యాచ్‌లోనే సెంచరీ (శతకం) సాధించారు. ఆ సమయంలో వన్డే క్రికెట్‌లో సెంచరీ చేసిన అతి పిన్న వయస్కురాలైన క్రికెటర్‌గా ఆమె ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ఈ రికార్డును ఐర్లాండ్‌కు చెందిన ఏ. హంటర్ దాదాపు 20 ఏళ్ల తర్వాత అదే 16 ఏళ్ల వయసులో సెంచరీ చేసి బద్దలు కొట్టింది. సచిన్ టెండూల్కర్ కూడా తన రెండో టెస్ట్ మ్యాచ్‌లో అత్యంత పిన్న వయస్కుడైన ఆటగాడిగా అర్ధశతకం (Fifty) సాధించిన రికార్డును నెలకొల్పారు. ఈ రికార్డు నేటికీ చెక్కుచెదరలేదు.

మిథాలీ పేరున మరికొన్ని అరుదైన రికార్డులు
మిథాలీ రాజ్ 1999 నుండి 2022 వరకు టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో రాణించారు. ఆమె సుదీర్ఘ కెరీర్‌లో అనేక మైలురాళ్లను అధిగమించింది. వన్డే కెరీర్లో 232 మ్యాచ్‌లలో 7805 పరుగులు (50.68 సగటుతో 7 సెంచరీలు, 64 అర్ధ సెంచరీలు) చేసింది. 2002లో ఇంగ్లాండ్‌తో జరిగిన టాంటన్ టెస్టులో 214 పరుగుల ఇన్నింగ్స్‌తో టెస్ట్ మ్యాచ్‌లో డబుల్ సెంచరీ చేసిన అతి పిన్న వయస్కురాలుగా రికార్డు సృష్టించారు. (వయస్సు 19 సంవత్సరాల 254 రోజులు). ఈ రికార్డు కూడా నేటికీ చెక్కుచెదరలేదు. అరంగేట్రం నుంచి రిటైర్మెంట్ వరకు 22 సంవత్సరాల 274 రోజుల సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ రికార్డు కూడా ఆమె పేరు మీదే ఉంది.వన్డే కెరీర్‌లో కెప్టెన్‌గా అత్యధికంగా 155 మ్యాచ్‌లకు నాయకత్వం వహించిన రికార్డు నెలకొల్పింది. వన్డే క్రికెట్‌లో వరుసగా 7 ఇన్నింగ్స్‌లలో అర్ధ సెంచరీలు సాధించిన ఏకైక క్రీడాకారిణి మిథాలీ.

Story first published: Wednesday, December 3, 2025, 11:47 [IST]
Other articles published on Dec 3, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+