రికార్డులు బద్దలే: 5ఏళ్లకే అండర్14 టీంలో, సచిన్ 2.0ను చూశారా?(వీడియో)
న్యూఢిల్లీ/హైదరాబాద్: క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ క్రికెట్ చరిత్రలోనే అనేక రికార్డులను తన పేరున నెలకొల్పాడు. అతనిలా ఆడటం అందరికీ సాధ్యం కాదు. కాగా, ఇప్పుడు ఓ ఐదేళ్ల బాలుడు అచ్చం సచిన్ టెండూల్కర్‌లానే ఆడుతూ అందరినీ మంత్రముగ్ధుల్ని చేస్తున్నాడు. సచిన్ 2.0, జూనియర్ సచిన్ టెండూల్కర్‌గా ఇప్పటికే పిలిపించుకుంటున్న ఆ బుడదతడి పేరు రుద్రప్రతాప్.
కాగా, సచిన్ టెండూల్కర్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో 15 ఏళ్లకే అరంగేట్రం చేశాడని మనందరికీ తెలుసు. అచ్చం అలాగే ఢిల్లీకి చెందిన రుద్ర ప్రతాప్ 5 ఏళ్ల వయసులోనే అండర్-14 ఢిల్లీ జట్టుకు ఎంపికై సంచలనం సృష్టించాడు.
రుద్రప్రతాప్ బ్యాటింగ్ చేస్తున్న 2014 నాటి వీడియో ఇప్పుడు ట్విట్టర్, ఫేస్‌బుక్‌లో చక్కర్లు కొడుతోంది. డెత్ ఓవర్లలో ప్రత్యర్థి జట్టుపై అతడి బ్యాటింగ్ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. రుద్ర ప్రతాప్ స్టాన్స్, టెంపర్‌మెంట్, తనకన్నా 10 ఏళ్ల పెద్దయిన బౌలర్లతో వ్యవహరించిన విధానం, సహచరులు పెవిలియన్ చేరుతున్నా.. క్రీజులో మనో నిబ్బరంతో నిలిచిన తీరు.. వీడియో చూసిన వారిని ముచ్చటగొలుపుతోంది.
అతడి డ్రెసింగ్స్ కూడా భలే వుంది. హెల్మెట్ బిగుతుగా ఉండేందుకు దాని కింద టోపీ పెట్టుకుంటాడు. థై ప్యాడ్స్‌ను చెస్ట్ గార్డుగా పెట్టుకున్నాడు. ఈ వీడియో చూసిన వారందరూ 'సచిన్ 2.0, జూనియర్ సచిన్ టెండూల్కర్ అంటూ పొగిడేస్తుండటం గమనార్హం. మరి రుద్ర ప్రతాప్.. సచిన్ అంతటి మంచి క్రికెటర్ కావాలని మనమూ ఆశిద్దాం.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications