Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కోహ్లీతో పోలికా.. నీ కంత సీన్ లేదు: ఛలోక్తులు, జోకులు

హైదరాబాద్: చిట్టగాంగ్‌లో వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో మిడిలార్డర్‌ బ్యాట్స్‌మెన్ షబ్బీర్‌ రెహ్మాన్‌ హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. తొలి ఇన్నింగ్స్ లో భాగంగా బంగ్లాదేశ్ ఆదిలోనే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ తరుణంలో షబ్బీర్‌ రెహ్మాన్‌ 113 బంతుల్లో 66 పరుగులు చేసి జట్టుని ఆదుకున్నాడు.

అంతేకాదు ముష్ఫికర్‌ రహీమ్‌ (68)తో కలిసి ఆరో వికెట్‌కు 105 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. దీంతో రెండో రోజు ఆట ముగిసిన తర్వాత షబ్బీర్‌ రెహ్మాన్‌పై ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లియాన్ ప్రశంసల వర్షం కురిపించాడు. 'అతనో (షబ్బీర్‌) మంచి ఆటగాడు. నాకు విరాట్‌ కోహ్లీని గుర్తుకు తెస్తున్నాడు' అని అన్నాడు.

Sabbir Rahman says he can bat like Virat Kohli: Twitterati couldn't stop laughing


నాథన్ వ్యాఖ్యలపై షబ్బిర్ తనదైన శైలిలో స్పందించాడు. 'నేను విరాట్ కోహ్లీ స్థాయి ఆటగాడ్ని కాగలను. తలుచుకుంటే ఏదైనా సాధ్యమే. కాకపోతే అతనితో నేను పోల్చుకోదలుచుకోలేదు. జట్టుకు అవసరమైన పరుగుల్ని సాధించడమే నాకు ముఖ్యం' అని షబ్బీర్ వ్యాఖ్యానించాడు. దీంతో అతడిని ఓ జోకర్‌లాగా నెటిజన్లు చూస్తున్నారు.

విరాట్ కోహ్లీ అభిమానులు మాత్రం షబ్బీర్‌పై సోషల్ మీడియా వేదికగా జోకులు పేల్చుతున్నారు. అంతేకాదు షబ్బిర్.. నీ కంత సీన్ లేదంటూ ట్విట్టర్‌లో నెటిజన్లు మండిపడుతున్నారు. నువ్వు విరాట్ కోహ్లి స్థాయి ఆటగాడివైతే ఇక మనం భూమిని విడిచే సమయం ఆసన్నమైనట్లే అంటూ ఛలోక్తులు విసిరారు.

'అది ఫొటోషాప్‌లోనే సాధ్యమవుతుంది' అని ఓ నెటిజన్ వ్యాఖ్యానించగా, 'నిద్ర నుంచి లేవాలిక' అని మరో అభిమాని అన్నాడు. ఇంకొకరు 'స్మిత్‌ నుంచి లియాన్‌కు బ్రెయిన్‌ ఫేడ్‌ వచ్చిందేమో' అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇది చాలా మంచి జోక్ అంటూ ఒకరు వ్యాఖ్యానించగా, ఇక ఈ భూగ్రహం ఎంతమాత్రం మనం నివసించడానికి సేఫ్‌గా లేనట్టేనని విమర్శించారు.

Story first published: Monday, November 13, 2017, 12:16 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+