
హైదరాబాద్: బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు సరైన నిర్థయమే తీసుకుందా.. పన్నెండేళ్ల అభిమానిని మ్యాచ్ జరుగుతుండగా ఆటకు విఘాతం కల్గిస్తున్నాడంటూ పక్కకు పిలిచి కొట్టాడు. విచారణ జరిపి చివరకు ఓ ఆర్నెళ్ల నిషేదాన్ని పదిహేను లక్షల జరిమానాను విధించారు. అంతేగాక షబ్బీర్ రెహ్మాన్ బోర్డు సెంట్రల్ కాంట్రాక్ట్ పొగొట్టుకున్నాడు
అసలేం జరిగింది?
బంగ్లాదేశ్ క్రికెటర్ షబ్బీర్ రహ్మాన్ రాజ్సషీ వేదికగా ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడుతున్నాడు. ఇది బంగ్లాదేశ్ జాతీయ లీగ్‌లో ఓ భాగం. ఇన్నింగ్స్ బ్రేక్ సమయంలో స్టేడియంలో కూర్చున్న అభిమాని ఒకరు వింత శబ్ధంతో రహ్మాన్‌కు చికాకు పుట్టించాడు. దీంతో పెవిలియన్‌కు చేరిన తర్వాత షబ్బీర్ రహ్మాన్ అతన్ని పిలిపించి కొట్టాడు.
ఇది గమనించిన రిజర్వ్ అంపైర్ మ్యాచ్ రిఫరీకి కంప్లైంట్ చేశాడు. మ్యాచ్ రిఫరీ షెకాతర్ రహ్మాన్ తప్పని వారించాడు. క్షమాపణ కోరవాల్సిందిగా చెప్పడంతో తిరిగి అతన్నే దూషించాడు. దీంతో అతనిపై ఛైర్మన్ అక్రమ్ ఖాన్‌కు ఫిర్యాదు చేశాడు. విచారించిన ఖాన్ రహ్మాన్‌పై చర్యలు తీసుకోకతప్పలేదు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.