
నంబర్ వన్ జట్టు వెస్టిండీస్:
ఇండియా న్యూస్‌కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సాబా కరీమ్ మాట్లాడుతూ... 'టీ20 ప్రపంచకప్‌లో నా నంబర్ వన్ జట్టు వెస్టిండీస్. రెండోది భారత్. విండీస్ జట్టులో అందరూ స్టార్లే ప్రతిఒక్కరు మ్యాచ్ విజేతలే. అందరూ భారీ సిక్సర్లు బాదగల పవర్ హిట్టర్లే. భారత్ యువత, అనుభవజ్ఞులతో సమతూకంగా ఉంది. భారత్ కూడా కప్ గెలవొచ్చు. అయితే ఒక జట్టు గురించి మనం తప్పక మాట్లాడుకోవాలి. ఆ జట్టే ఇంగ్లండ్. పరిమిత ఓవర్ల క్రికెట్‌కు వారు సరికొత్త రూపు తీసుకొచ్చారు. ప్రస్తుతం ఇంగీష్ జట్టు సమతూకంగానూ కనిపిస్తోంది. టీ20 ప్రపంచకప్‌లో వారు కూడా గట్టి పోటీదారు' అని అన్నాడు.

భారత్, న్యూజిలాండ్ తలపడితే:
టీ20 ప్రపంచకప్ 2021లో భారత్, న్యూజిలాండ్ ఫైనల్ చేరే అవకాశం ఉందని మరో భారత మాజీ క్రికెటర్ రీతిందర్ సింగ్ పేర్కొన్నాడు. ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ విజయం కివీస్ జట్టులో అంతులేని ఆత్మవిశ్వాసం నింపుతుందన్నారు. పొట్టి క్రికెట్ టైటిల్‌నూ గెలుచుకోవాలని కేన్ విలియమ్సన్ నేతృత్వంలోని టీమ్ పట్టుదల ప్రదర్శిస్తుందని అంచనా వేశారు. టీ20 ప్రపంచకప్ ఫైనల్లోనూ భారత్, న్యూజిలాండ్ తలపడితే ఆసక్తికరంగా ఉంటుందని రీతిందర్ అన్నారు. టీ20 ప్రపంచకప్‌ను విండీస్ రెండుసార్లు గెలుచుకోగా.. భారత్, పాకిస్తాన్, ఇంగ్లండ్, శ్రీలంక ఒక్కోసారి గెలుచుకున్నాయి.

నాలుగు వేదికల్లో:
టీ20 ప్రపంచకప్ 2021 టోర్నీ మ్యాచ్‌లు మొత్తం నాలుగు వేదికల్లో జరగనున్నాయి. యూఏఈ, ఒమన్ దేశాలు మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం, ద షేక్ జాయెద్ స్టేడియం (అబుదాబి), షార్జా స్టేడియం, ఒమన్ క్రికెట్ అకాడమీ గ్రౌండ్‌లో మెగా టోర్నీ మ్యాచ్‌లను నిర్వహించనున్నారు. టోర్నమెంట్ తొలి రౌండ్‌లో అర్హత సాధించిన 8 జట్లు (బంగ్లాదేశ్, శ్రీలంక, ఐర్లాండ్, నెదర్లాండ్స్, స్కాట్‌ల్యాండ్, నమీబియా, ఒమన్, పప్వా న్యూ గునియా).. రెండు గ్రూపులుగా విడిపోయి మ్యాచ్‌లు ఆడుతాయి. ఈ 8 జట్ల నుంచి 4 టీమ్‌లు.. సూపర్ 12కు ఎంపికవుతాయి. ఆ నాలుగు జట్లు.. 8 ఆటోమెటిక్ క్వాలిఫైయర్స్‌తో కలుస్తాయి.


Click it and Unblock the Notifications












