Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SAT20: సన్ రైజర్స్ బ్యాటర్ 105 మీటర్ల భారీ సిక్స్.. కావ్య పాపే టార్గెట్!

సౌతాఫ్రికా టీ20 లీగ్ లో మూడో సారి టైటిల్ సాధించడమే లక్ష్యంగా బరిలోకి దిగిన సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ కు నిరాశ ఎదురైంది. ముంబయి ఇండియన్స్ ట్రోఫీని తొలిసారి ఎత్తుకుపోయింది. 182 పరుగుల లక్ష్య చేధనతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్‌ లోని మిగతా బ్యాటర్లు విఫలమైనప్పటికీ.. టామ్‌ అబెల్‌(30),టోనీ డిజోర్జే(26) మాత్రం జట్టును విజయపథంలోకి నడిపించాలని ఆశించి, పర్వాలేదనిపించారు.

అయితే ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ ఓటమి చెందినప్పటికీ.. టోనీ డిజోర్జే గురించి తెగ మాట్లాడుకుంటున్నారు క్రికెట్ అభిమానులు. 23 బంతుల్లో 113 స్ట్రైక్ రేట్ తో 3 ఫోర్ల సాయంతో 26 పరుగులు చేసిన అతడు.. కళ్లు చెదిరేలా ఓ భారీ సిక్స్ కూడా బాదాడు. ఆకాశంలోకి దూసుకెళ్లిన ఆ సిక్స్ మ్యాచ్ కే హైలైట్ గా నిలిచింది. టోనీ డిజోర్జే బాదిన ఈ షాట్ ఏకంగా 105 మీటర్ల దూరం గాల్లోకి వెళ్లింది. దీంతో క్రికెట్ అభిమానులంతా షాక్ అయిపోయారు. కేరింతలు, ఈలలుతో స్టేడియాన్ని హోరెత్తించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

SA20 Tony de zorzi 105 meter longest six in kavya maran sunrisers vs mumbaicape town match

ఆటగాళ్లను ప్రోత్సాహించేందుకు కావ్యపాప
ఈ సీజన్ ​ను హ్యాట్రిక్ ఓటములతో ఆరంభించిన సన్ రైజర్స్​, ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకుని కీలక మ్యాచుల్లో విజయాలు సాధించింది. దీంతో ప్లేఆఫ్స్​ కు అర్హత సాధించింది. ఇక ఎలిమినేటర్ మ్యాచ్ లోనూ విజయం సాధించి ఫైనల్ చేరడంతో సన్ రైజర్స్ మరో సారి కప్పు గెలవడం గ్యారెంటీ అని అంతా ఫిక్స్ అయిపోయారు. దీంతో సన్ రైజర్స్ ఫ్రాంచైజీ ఓనర్ కావ్యా మారన్ కూడా స్టేడియానికి వచ్చి ప్రత్యక్షంగా మ్యాచ్ ను వీక్షించారు. తమ జట్టు ఆటగాళ్లను ప్రోత్సహించారు. అదే విధంగా సన్ రైజర్స్ బ్యాటర్లు కూడా తమ ఓనర్ ముఖంలో సంతోషాలని చూడాలనుకుని, జట్టుకు విజయాన్ని అందించాలని అనుకున్నారు. ఈ క్రమంలోనే దూకుడుగా ఆడుతూ.. టోనీ డిజోర్జే భారీ సిక్స్ ను కూడా బాదాడు. కానీ అతడిని ముంబయి బౌలర్లు వెంటనే కట్టడి చేసి పెవిలియన్ పంపారు. మిగతా బ్యాటర్లు కూడా విఫలమైపోయారు.

టీమిండియాపై సెంచరీ.. పార్ల్ రాయల్స్ పై హాఫ్ సంచరీ
టోనీ.. గతంలో 2023లో సౌతాఫ్రిక్రా వేదికగా జరిగిన సిరీస్ లో భారత్ పై శతకం బాదాడు. ఆ సిరీస్ లోని రెండో వన్డే లో 119 పరుగుల మ్యాచ్ విన్నింగ్ పెర్ఫామెన్స్ చేశాడు. అది అతడి కెరీర్ లోనే బెస్ట్ స్కోర్. ఇక రీసెంట్ గా సౌతాఫ్రికా టీ20 లీగ్ లో కూడా సెకండ్ క్వాలిఫయర్ లో పార్ల్ రాయల్స్ పై 8 వికెట్ల తేడాతో విజయం సాధించడంలోనూ టోనీ కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్ లో కేవలం 49 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్స్ ల సాయంతో 78 పరుగుల హాఫ్ సెంచరీ బాదాడు.

Story first published: Sunday, February 9, 2025, 11:35 [IST]
Other articles published on Feb 9, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+