For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

లైవ్ మ్యాచ్ : అభిమాని అద్భుత క్యాచ్ - రూ.90 లక్షల రివార్డ్(వీడియో వైరల్)

దక్షిణాఫ్రికా టీ20 లీగ్ SA20లో అద్భుతం చోటు చేసుకుంది. స్టాండ్స్ లో కూర్చొని మ్యాచ్ చూస్తున్న ఓ ప్రేక్షకుడు బ్యాటర్ బాదిన సిక్సర్ ను ఒంటి చేత్తో అద్భుతమైన క్యాచ్ గా పట్టుకోవడంతో కోటీశ్వరుడిగా మారిపోయాడు. ఇంతకీ ఏం జరిగిందో కథనంలోకి వెళ్లి తెలుసుకుందాం.

దక్షిణాఫ్రికా టీ20 లీగ్ SA20 ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ లీగ్ కు కూడా క్రికెట్ అభిమానుల్లో మంచి క్రేజ్ ఏర్పడింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతోమంది క్రికెటర్లు ఈ లీగ్ బరిలోకి దిగి తమ ప్రతిభను కనబరుస్తున్నారు. అయితే సాధారణంగా ఏ లీగ్ లో అయినా, అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ లో అయినా... ఆటగాళ్లతో పాటు క్రికెట్ కు సంబంధించిన వాళ్లు మాత్రమే డబ్బును ఆర్జిస్తుంటారు. అలానే మ్యాచుల్లో అద్భుతమైన క్యాచులు పట్టినందుకు కూడా ప్లేయర్స్ కు నగదు బహుమతిని అందిస్తుంటారు.

SA20 League Fan plucks brilliant one handed catch to pocket INR 90 lakh in durbans super giants vs pritoria capitals match Watch video

కానీ ఈ సారి మాత్రం తాజాగా SA20 లీగ్ లో ఓ అద్భుతమైన క్యాచ్ పట్టినందుకు ప్లేయర్ కాకుండా ఓ ప్రేక్షకుడు ప్రైజ్ మనీని అందుకున్నాడు. అతడిపై కాసుల వర్షం కురిసింది. ఈ ఇన్సిడెంట్ డర్బన్స్ సూపర్ జెయింట్స్, ప్రిటోరియా క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో జరిగింది.

లైఫ్ ఛేంజ్ చేసిన సిక్స్
డర్బన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు మొదటగా బ్యాటింగ్ కు దిగింది. డర్బన్ సూపర్ జెయింట్స్ తరఫున బరిలోకి దిగిన న్యూజిలాండ్ దిగ్గజ బ్యాటర్ కేన్ విలియమ్సన్ (60) అద్భుత హాఫ్ సెంచరీతో మెరిశాడు. జట్టు స్కోరును 200 పరుగులు దాటించాడు. దీంతో టీమ్ 209 రన్స్ చేసింది. అయితే, విలియమ్సన్ తన జట్టుకు మంచి స్కోర్ అందించడంతో పాటు మ్యాచ్ చూడటానికి వచ్చిన ఓ అభిమానిని కూడా ఊహించని విధంగా సాయం చేశాడు.

ఇన్నింగ్స్ 17వ ఓవర్ మూడో బంతిని కేన్ విలియమ్సన్ స్లాగ్ స్వీప్ ఆడాడు. గాలిలోకి భారీ షాట్ బాదాడు. బంతి నేరుగా డీప్ స్క్వేర్ లెగ్ బౌండరీ దాటి స్టాంట్స్ లోకి వెళ్లగా అక్కడే అద్భుతం చోటు చేసుకుంది. సీట్లలో కూర్చున్న ప్రేక్షకులు బంతిని క్యాచ్ పట్టుకోవడానికి ప్రయత్నించారు. వారిలో ఓ ప్రేక్షకుడు అద్భుతమైన స్టైల్‌లో ఒంటి చేత్తో ఈ క్యాచ్ పట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు. దీంతో అతడికి జాక్ పాట్ తగిలింది. ఒక రొటీన్ సిక్స్ అతడి లైఫ్ నే మార్చేసి కాసుల వర్షం కురిపించింది.

క్యాచ్‌తో కోటీశ్వరుడిగా
క్యాచ్ పట్టిన వెంటనే సదరు ప్రేక్షకుడి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అతడి చుట్టూ ఉన్న ఆడియెన్స్ కూడా కేరింతలు కొడుతూ అతడిని అభినందించారు. ఇక ఈ క్యాచ్ పట్టినందుకు మ్యాచ్ నిర్వాహకులు ఆ ప్రేక్షకుడికి 2 మిలియన్ ర్యాండ్ అందించారు. అంటే దాదాపు రూ. 90 లక్షలు అన్న మాట.

కాగా, SA20లో క్రికెటర్లకు మాత్రమే కాకుండా ప్రేక్షకులకు కూడా ప్రైజ్ మనీ ఇస్తుంటారు నిర్వాహకులు. క్యాచ్ ఏ మిలియన్ పేరిట దీన్ని నిర్వహిస్తుంటారు. 18ఏళ్లు పైబడిన ఆడియెన్స్ కు క్లీన్ వన్ హ్యాండెడ్ క్యాచ్ పడితే వన్ మిలియన్ ర్యాండ్ లేదా అంతకన్నా ఎక్కువ మొత్తాన్ని ప్రైజ్ మనీగా ఇస్తుంటారు. అదే పార్టిసిపెంట్ స్పాన్సర్ క్లైంట్ అయితే ప్రైజ్ మనీ డబుల్ ఉంటుంది. అందుకే అక్కడ మ్యాచ్ చూసేందుకు ఎక్కువ మంది ప్రేక్షకులు వస్తుంటారు.

Story first published: Saturday, January 11, 2025, 11:39 [IST]
Other articles published on Jan 11, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+