SA vs SL: డికాక్‌కు లైన్ క్లియర్.. క్లాసెన్‌పై వేటు! అసలంకపైనే భారం! దక్షిణాఫ్రికా, శ్రీలంక తుది జట్లు ఇవే!!

హైదరాబాద్: టీ20 ప్రపంచకప్ 2021 సూపర్-12లో భాగంగా ఈరోజు మరో రసవత్తర పోరు జరగనుంది. షార్జా క్రికెట్ మైదానంలో శ్రీలంక, దక్షిణాఫ్రికా జట్లు శనివారం తలపడనున్నాయి. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు టాస్ పడనుండగా.. 3.30కి మ్యాచ్ ఆరంభం కానుంది. స్టార్ స్పోర్ట్స్, డిస్నీ హాట్ స్టార్ యాప్‌లో మ్యాచ్‌ను ప్రత్యక్ష ప్రసారం చోడొచ్చు. మెగా టోర్నీలో ఇప్పటివరకు శ్రీలంక, దక్షిణాఫ్రికా జట్లు రెండు మ్యాచ్‌లు ఆడగా.. ఒక్కో గేమ్‌లో గెలిచాయి. గ్రూప్ 1లో పాయింట్ల పట్టికలో దక్షిణాఫ్రికా 3వ స్థానంలో ఉండగా.. శ్రీలంక జట్టు 4వ స్థానంలో ఉంది. టోర్నీలో ముందుగకు సాగాలంటే.. ఇరు జట్లకు ఈ మ్యాచ్ ఎంతో కీలకం. ఈ నేపథ్యంలో మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది.

హెడ్ టు హెడ్ రికార్డ్స్:
ఇప్పటివరకు శ్రీలంక, దక్షిణాఫ్రికా జట్లు 16 టీ20 మ్యాచుల్లో తలపడ్డాయి. ఇందులో 11 మ్యాచ్‌ల్లో దక్షిణాఫ్రికా, 5 మ్యాచుల్లో శ్రీలంక విజయం సాధించాయి. ఇక ప్రపంచకప్ పోరులో ఇరు జట్లు మూడుసార్లు తలపడగా.. 2-1తో దక్షిణాఫ్రికా ఆధిక్యంలో ఉంది. ఈరోజు మ్యాచ్ షార్జా క్రికెట్ మైదానంలో జరగనుంది. షార్జా పిచ్ బ్యాటింగ్‌కు అత్యంత కష్టతరమైన మైదానంగా పేరుగాంచింది. ఐపీఎల్ 2021లో ఇది స్పష్టంగా కనిపించింది. ఇక్కడ ఏ జట్టు కూడా భారీ స్కోర్ చేయలేకపోయింది. టీ20 ప్రపంచకప్ 2021 కూడా తక్కువ స్కోరులే నమోదయ్యాయి. అయితే ఈ పిచ్‌లో శ్రీలంక బ్యాట్స్‌మెన్లు రెండు అర్థ సెంచరీలు కూడా నమోదు చేశారు. 150-160 పరుగులను కూడా ఇక్కడ సునాయాసంగా కాపాడుకోవచ్చు. షార్జా పిచ్ పూర్తిగా స్పిన్నర్లకు అనుకూలిస్తున్న విషయం తెలిసిందే. టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్ ఎంచుకునే అవకాశాలే ఎక్కువ.

డికాక్ ఆగయా:
దక్షిణాఫ్రికా తన చివరి గేమ్‌లో వెస్టిండీస్‌ను 8 వికెట్ల తేడాతో చిత్తుచిత్తుగా ఓడించింది. వెస్టిండీస్ 143/8 మంచి స్కోరును నమోదు చేసినా.. రాస్సీ వాన్ డెర్ డుస్సెన్ (43), ఐడెన్ మార్క్రామ్ (51 నాటౌట్) రాణించడంతో దక్షిణాఫ్రికా సునాయాస విజయం అందుకుంది. దాంతో దక్షిణాఫ్రికా పూర్తి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగనుంది. స్టార్ ఓపెనర్ క్వింటన్ డికాక్ ఈరోజు మ్యాచులో ఆడే అవకాశం ఉంది. డికాక్ మోకాలిపై కూర్చోవడాన్ని వ్యతిరేకించిన తర్వాత విండీస్‌తో జరిగిన మ్యాచులో అతడు ఆడలేదు. అయితే తనను క్షమించాలని, ఇకనుంచి దక్షిణాఫ్రికా ఆడే మ్యాచులలో తాను మోకాళ్లపై కూర్చుంటానని డికాక్ స్పష్టం చేశాడు. దాంతో టెంబా బావుమాతో కలిసి లంకపై అతడు ఓపెనింగ్ చేయనున్నాడు. రాస్సీ వాన్ డెర్ డుసెన్, ఐడెన్ మార్క్రామ్ ఫామ్ ప్రొటీస్ జట్టుకు కలిసిరానుంది. డేవిడ్ మిల్లర్, రీజా హెండ్రిక్స్, టెంబా బావుమా కూడా రాణిస్తే తిరుగుండదు. ఇక బౌలింగ్‌లో కగిసో రబడ, కేశవ్ మహరాజ్, అన్రిచ్ నోర్జ్, తబ్రైజ్ షమ్సీ రాణిస్తున్నారు.

అసలంకపైనే లంక ఆశలు:
శ్రీలంక తమ చివరి ఎన్‌కౌంటర్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. శ్రీలంక మొదట బ్యాటింగ్ చేసి ఆరు వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. కుసాల్ పెరెరా, చరిత్ అసలంక, భానుక రాజపక్సే రాణించారు. యువ ప్లేయర్ అసలంకపైనే లంక ఆశలు పెట్టుకుంది. ప్రతి బంతిని బాదాలని చూసే అసలంక.. ఈరోజు కూడా మరో కీలక ఇన్నింగ్స్ ఆడాలని లంక ఆశిస్తోంది. అసలంకకు తోడు కుశాల్ పెరీరా కూడా బ్యాట్ జుళిపిస్తే.. లంకకు తిరుగుండదు. అవిష్క ఫెర్నాండో, భానుక రాజపక్స ఫామ్ కలిసిరానుంది. అయితే కెప్టెన్ దసున్ షనక ఫామ్ లంక జట్టును ఆందోళన కలిగిస్తోంది. మిక్కీ ఆర్థర్ తాను తుది జట్టులో వీలైనంత తక్కువగా మార్పులు చేయాలనుకుంటున్నట్లు తెలిపాడు. అయితే చమికా కరుణరత్నే కోసం అకిల దనంజయ లేదా ధనంజయ డి సిల్వాను తప్పించడం కష్టమేనని అన్నాడు. దుష్మంత చమీర, లహిరు కుమార, మహేశ్ తీక్షణ బౌలింగ్ లంకకు కలిసిరానుంది.

తుది జట్లు (అంచనా):
దక్షిణాఫ్రికా: టెంబా బావుమా (కెప్టెన్), క్వింటన్ డి కాక్ (కీపర్), రాస్సీ వాన్ డెర్ డుసెన్, ఐడెన్ మార్క్రామ్, డేవిడ్ మిల్లర్, రీజా హెండ్రిక్స్, డ్వైన్ ప్రిటోరియస్, కగిసో రబడ, కేశవ్ మహరాజ్, అన్రిచ్ నోర్జ్, తబ్రైజ్ షమ్సీ.
శ్రీలంక: పాతుమ్ నిస్సాంక, కుసల్ పెరెరా (కీపర్), చరిత్ అసలంక, అవిష్క ఫెర్నాండో, భానుక రాజపక్స, వనిందు హసరంగా, దసున్ షనక (కెప్టెన్), చమిక కరుణరత్నే, దుష్మంత చమీర, లహిరు కుమార, మహేశ్ తీక్షణ.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications