Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SA vs SL: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా.. డికాక్ ఇన్! విన్నింగ్ కాంబినేషన్‌తోనే బరిలోకి శ్రీలం

SA vs SL Playing 11 is out: Quinton de Kock comes in for Heinrich Klaasen

షార్జా: టీ20 ప్రపంచకప్ 2021 సూపర్-12లో భాగంగా మరికొద్దిసేపట్లో మరో రసవత్తర పోరు ప్రారంభం కానుంది. షార్జా క్రికెట్ మైదానంలో శ్రీలంక, దక్షిణాఫ్రికా జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచులో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బావుమా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచులో స్టార్ ఓపెనర్ క్వింటన్ డికాక్ ఆడుతున్నాడు. డికాక్ మోకాలిపై కూర్చోవడాన్ని వ్యతిరేకించిన తర్వాత విండీస్‌తో జరిగిన మ్యాచులో అతడు ఆడలేదు. అయితే తనను క్షమించాలని, ఇకనుంచి దక్షిణాఫ్రికా ఆడే మ్యాచులలో తాను మోకాళ్లపై కూర్చుంటానని డికాక్ స్పష్టం చేశాడు. దాంతో టెంబా బావుమాతో కలిసి లంకపై అతడు ఓపెనింగ్ చేయనున్నాడు. మరోవైపు లంక తమ తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు. విన్నింగ్ కాంబినేషన్‌తోనే శ్రీలంక బరిలోకి దిగుతోంది.

ఇప్పటివరకు శ్రీలంక, దక్షిణాఫ్రికా జట్లు 16 టీ20 మ్యాచుల్లో తలపడ్డాయి. ఇందులో 11 మ్యాచ్‌ల్లో దక్షిణాఫ్రికా, 5 మ్యాచుల్లో శ్రీలంక విజయం సాధించాయి. ఇక ప్రపంచకప్ పోరులో ఇరు జట్లు మూడుసార్లు తలపడగా.. 2-1తో దక్షిణాఫ్రికా ఆధిక్యంలో ఉంది. ఈరోజు మ్యాచ్ షార్జా క్రికెట్ మైదానంలో జరగనుంది. షార్జా పిచ్‌ బ్యాటింగ్‌కు అత్యంత కష్టతరమైన మైదానంగా పేరుగాంచింది. ఐపీఎల్ 2021లో ఇది స్పష్టంగా కనిపించింది. ఇక్కడ ఏ జట్టు కూడా భారీ స్కోర్ చేయలేకపోయింది. టీ20 ప్రపంచకప్ 2021 కూడా తక్కువ స్కోరులే నమోదయ్యాయి. అయితే ఈ పిచ్‌లో శ్రీలంక బ్యాట్స్‌మెన్లు రెండు అర్థ సెంచరీలు కూడా నమోదు చేశారు. 150-160 పరుగులను కూడా ఇక్కడ సునాయాసంగా కాపాడుకోవచ్చు. షార్జా పిచ్ పూర్తిగా స్పిన్నర్లకు అనుకూలిస్తున్న విషయం తెలిసిందే.

తుది జట్లు:
దక్షిణాఫ్రికా: టెంబా బావుమా (కెప్టెన్), క్వింటన్ డి కాక్ (కీపర్), రాస్సీ వాన్ డెర్ డుసెన్, ఐడెన్ మార్క్రామ్, డేవిడ్ మిల్లర్, రీజా హెండ్రిక్స్, డ్వైన్ ప్రిటోరియస్, కగిసో రబడ, కేశవ్ మహరాజ్, అన్రిచ్ నోర్జ్, తబ్రైజ్ షమ్సీ.
శ్రీలంక: పాతుమ్ నిస్సాంక, కుసల్ పెరెరా (కీపర్), చరిత్ అసలంక, అవిష్క ఫెర్నాండో, భానుక రాజపక్స, వనిందు హసరంగా, దసున్ షనక (కెప్టెన్), చమిక కరుణరత్నే, దుష్మంత చమీర, లహిరు కుమార, మహేశ్ తీక్షణ.

Story first published: Saturday, October 30, 2021, 15:23 [IST]
Other articles published on Oct 30, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+