న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

SA vs SL: డీన్ ఎల్గర్ డ్యాన్స్ మూవ్ చూశారా? (వీడియో)

 SA vs SL: Dean Elgar’s dance move while attempting run-out is the funniest thing you will see today

హైదరాబాద్: డర్బన్ వేదికగా శ్రీలంక, దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న తొలి టెస్టులో ఓ సరదా సంఘటన క్రికెట్ అభిమానులను ఆకట్టుకుంటోంది. శ్రీలంక జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 38/1తో నిలిచిన దశలో మరో వికెట్‌‌ను పడగొట్టే అవకాశాన్ని దక్షిణాఫ్రికా బౌలర్ డీన్ ఎల్గర్ జారవిడిచాడు.

<strong>పుల్వామా ఉగ్ర దాడి: సానియాపై ట్రోలింగ్‌! చివరకు ట్విట్టర్‌లో ఖండన</strong>పుల్వామా ఉగ్ర దాడి: సానియాపై ట్రోలింగ్‌! చివరకు ట్విట్టర్‌లో ఖండన

బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తోన్న డేల్ స్టెయిన్ విసిరిన బంతిని అందుకోలేకపోయిన ఎల్గర్.. స్టైల్‌గా రనౌట్ చేసినట్లు మాత్రం అందరినీ భ్రమలోకి నెట్టాడు. దీంతో ఫీల్డ్ అంఫైర్ థర్డ్ అంఫైర్‌కు నివేదించడంలో టీవీ రిఫ్లైలో అసలు విషయం వెల్లడైంది. వివరాల్లోకి వెళితే...

శ్రీలంక ఇన్నింగ్స్‌ 15వ ఓవర్ వేసిన ఎల్గర్.. ఐదో బంతిని ప్లైలెడ్ డెలివరీగా సంధించాడు. క్రీజులో ఉన్న లంక బ్యాట్స్‌మెన్ దిముత్ కరుణరత్నె బంతిని లెగ్ సైడ్ దిశగా ప్లిక్ చేసి పరుగు కోసం నాన్‌స్ట్రైక్ ఎండ్‌లోని ఫెర్నాండోని పిలిచాడు. బంతి నేరుగా బౌండరీ లైన వద్ద ఫీల్డింగ్ చేస్తోన్న డేల్ స్టెయిన్ చేతుల్లోకి వెళ్లింది.

దీంతో వెనక్కి తగ్గిన కరుణరత్నె పరుగు ప్రయత్నాన్ని విరమించుకుని ఫెర్నాండోని వెనక్కి వెళ్లిపోవాల్సిందిగా సూచించాడు. ఇద్దరూ ఎట్టు వెళ్లాలో? తెలియక కాసేపు తికమకకి గురవగా.. బంతిని అందుకున్న స్టెయిన్ నేరుగా బౌలింగ్‌ ఎండ్‌లో ఉన్న ఎల్గర్‌కి విసిరాడు. బంతి వేగానికి కంగారుపడిన ఎల్గర్ దాన్ని అందుకోలేకపోయాడు.

అయితే, బంతిని అందుకున్నట్లు భావించి డ్యాన్స్ చేస్తూ స్టైల్‌గా రనౌట్ చేశాడు. ఈ క్రమంలో అతని కాలు వికెట్లను తాకడంతో బెయిల్స్ పడిపోయాయి. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. రనౌట్ చేసే క్రమంలో మైదానంలో ఎల్గర్ డ్యాన్స్ చాలా బాగుందంటూ అభిమానులు పొగడ్తలు కురిపిస్తున్నారు.

Story first published: Friday, February 15, 2019, 18:05 [IST]
Other articles published on Feb 15, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X