SA vs PAK: ఐపీఎల్ కోసం వన్డే సిరీస్ ఓడిన సౌతాఫ్రికా.. మండిపడుతున్న మాజీ క్రికెటర్లు!

న్యూఢిల్లీ: వరల్డ్ వైడ్‌గా ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ క్యాష్ రిచ్ లీగ్ వరల్డ్ బెస్ట్ లీగ్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. క్రికెట్ పెద్దన్న భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)కి చెందిన ఈ లీగ్‌లో ఆడేందుకు క్రికెటర్లంతా క్యూ కడతారు. ఒక్కసారైన ఈ లీగ్ ఆడాలని లక్ష్యంగా పెట్టుకుంటారు. ఈ ధనాధన్ లీగ్ కోసం ఆటగాళ్లు సొంత దేశ క్రికెట్ బోర్డులను వ్యతిరేకించిన సందర్భాలున్నాయి.

ఈ క్రమంలోనే ఈ లీగ్ జరుగుతున్నప్పుడు ఇతర మ్యాచ్‌ల్లేకుండా ఐసీసీ కూడా జాగ్రత్తపడుతుంటుంది. అయితే తాజాగా సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు వ్యవహరించిన తీరు విమర్శలకు దారి తీసింది. పాకిస్థాన్‌తో వన్డే సిరీస్ జరుగుతుండగానే ఆ దేశ క్రికెట్ బోర్డు తమ ఆటగాళ్లను ఐపీఎల్ కోసం అనుమతిచ్చింది.

సీనియర్లు లేక..

సీనియర్లు లేక..

దాంతో సీనియర్ ఆటగాళ్లైన కగిసో రబడా, క్వింటన్ డికాక్, లుంగి ఎంగిడి, డేవిడ్ మిల్లర్ లేకుండానే ఆ జట్టు పాకిస్థాన్‌తో చివరి వన్డే ఆడింది. ఈ మ్యాచ్‌లో ఫకర్‌ జమాన్‌ (104 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 101) సెంచరీకి తోడుగా కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ (82 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లు 97 ), ఇమామ్‌ ఉల్‌ హఖ్‌ (57) అర్ధ సెంచరీలతో చెలరేగడం పాకిస్థాన్ 28 పరుగుల తేడాతో గెలుపొందింది. ఫలితంగా సిరీస్‌ను 2-1తో సొంతం చేసుకుంది. 2013 తర్వాత సఫారీ గడ్డపై పాక్‌ వన్డే సిరీస్‌ నెగ్గడం గమనార్హం. సఫారీ గడ్డపై పాక్‌కు ఇది రెండో వన్డే సిరీస్ విజయం. దాంతో ఈ ఘనతను అందుకున్న తొలి ఆసియా జట్టుగా పాక్ నిలిచింది.

యువ ఆటగాళ్లు పోరాడినా..

యువ ఆటగాళ్లు పోరాడినా..

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన పాకిస్థాన్‌ 50 ఓవర్లలో 7 వికెట్లకు 320 పరుగులు సాధించింది. చివర్లో హసన్‌ అలీ (11 బంతుల్లో 32 నాటౌట్‌) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. రెండో వికెట్‌కు ఫకర్, బాబర్ 94 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. సఫారీ బౌలర్లలో కేశవ్ మహరాజ్ మూడు వికెట్లు తీయగా.. మార్క్‌రమ్ రెండు వికెట్ల పడగొట్టాడు. ఫెలుక్వాయో, స్మట్స్‌కు తలో వికెట్ దక్కింది. అనంతరం సౌతాఫ్రికా 49.3 ఓవర్లలో 292 పరుగులకు ఆలౌటైంది. మలన్(70), వెరీన్‌ (62), ఫెలుక్వాయో (54) అర్ధ సెంచరీలు మినహా మిగతా బ్యాట్స్‌మెన్ విఫలమయ్యాడు. పాక్ బౌలర్లలో షాహీన్‌ అఫ్రిది, నవాజ్‌లకు మూడేసి వికెట్లు దక్కగా.. హారిస్ రౌఫ్‌ రెండు వికెట్లు తీశాడు. హసన్ అలీ, ఉస్మాన్ ఖాదీర్‌లకు చెరొక వికెట్ లభించింది.

దేశం కన్నా ఐపీఎల్ ఎక్కువైందా?

దేశం కన్నా ఐపీఎల్ ఎక్కువైందా?

ఇక సౌతాఫ్రికా ఓటమికి సీనియర్లు లేకపోవడం కారణమనే విషయం స్పష్టంగా తెలుస్తోంది. దాంతో ఆ దేశ క్రికెట్ బోర్డుతో పాటు ఆటగాళ్లపై అభిమానులు, మాజీ క్రికెటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సఫరీ ఆటగాళ్లకు దేశం కన్నా ఐపీఎల్ ఎక్కువైందా? అని ప్రశ్నిస్తున్నారు. అసలు సొంతగడ్డపై వన్డే సిరీస్‌ను కోల్పోవడానికి సిగ్గుండాలని ఘాటుగా కామెంట్ చేస్తున్నారు. సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు తీరు కూడా ఏమాత్రం బాలేదని మాజీ క్రికెటర్లు విమర్శిస్తున్నారు. ఓ లీగ్ కోసం అంతర్జాతీయ వన్డే సిరీస్‌ను లైట్ తీసుకోవడం విస్మయపరుస్తుందంటున్నారు.

సఫారీ బోర్డుపై అఫ్రిది ఫైర్

పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది సౌతాఫ్రికా క్రికెట్ బోర్డుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. సిరీస్ మధ్యలో తమ ఆటగాళ్లను ఐపీఎల్ కోసం అనుమతించడం ఆశ్చర్యకరంగా ఉందని ఈ పాక్ దిగ్గజం ట్వీట్ చేశాడు. ‘వన్డే సిరీస్ మధ్యలో సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు తమ ఆటగాళ్లను ఐపీఎల్ కోసం అనుమతించడం ఆశ్చర్యకరంగా ఉంది. టీ20 లీగ్స్ అంతర్జాతీయ క్రికెట్‌ను ప్రభావం చేయడం దారుణం. ఈ విషయంపై పునరాలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది'అని అఫ్రిది ఆగ్రహం వ్యక్తం చేశాడు.

ఇది మీ టీమ్.. టైటిల్ గెలిచేందుకే వచ్చాం.. ఆకట్టుకుంటున్న పాంటింగ్ మోటివేషనల్ స్పీచ్ (వీడియో)

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Thursday, April 8, 2021, 12:08 [IST]
Other articles published on Apr 8, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X