For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

SA VS NZ: ఆ జట్టు ఫైనల్‌ చేరితే.. ఇక భారత్‌దే విజయం!

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కథ క్లైమాక్స్‌కు చేరింది. తొలి సెమీస్‌లో విజయం సాధించిన టీమిండియా.. ఫైనల్‌కు అర్హత సాధించింది. రెండో సెమీఫైనల్ దక్షిణాఫ్రికా న్యూజిలాండ్ మధ్య జరుగుతోంది. ఈ రెండింటిలో విజయం సాధించిన జట్టే భారత్‌తో తలపడేందుకు ఫైనల్‌కు దూసుకెళ్తోంది. దీంతో తుది పోరులో టీమిండియాతో తలపడే జట్టు ఏదా అని అభిమానులు తీవ్ర ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. అదే సమయంలో దక్షిణాఫ్రికా - న్యూజిలాండ్.. ఈ రెండింటిలో ఏది టైటిల్ పోరుకు అర్హత సాధిస్తే భారత్ ఎదుర్కోవడానికి సులంభంగా ఉంటుందా అని అంచనా కూడా వేస్తున్నారు క్రికెట్ అభిమానులు. ఈ నేపథ్యంలో ఏ జట్టుతో భారత్ తలపడితే విజయవకాశాలు ఎక్కువగా ఉంటాయో ఇక్కడ తెలుసుకుందాం.

విశ్లేషకుల అంచనా ప్రకారం.. ఫైనల్ లో సౌతాఫ్రికాతో తలపడితే భారత్ కు ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి. అంటే గెలిచే అవకాశాలు కాస్త ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే సౌతాఫ్రికాతో భారత్ ఎక్కువ సార్లు తలపడిన అనుభవం ఉంది. రీసెంట్ గా కూడా టీ20 ప్రపంచ కప్ ఫైనల్ లోనూ సఫారీలను మనోళ్లు ఓడించారు. కాబట్టి దక్షిణాఫ్రికా ప్లేయర్లు ఎలా ఆడతారు, వారి వ్యూహాలు ఎలా ఉంటాయి, ఎలా బౌలింగ్ చేస్తారు అనే దానిపై కాస్త ఎక్కువగానే అవగాహన ఉంటుంది. పైగా ముఖ్యమైన మ్యాచుల్లో ఆ జట్టుకు ఓటమి చెందే అలావాటు ఎక్కువే.

SA VS NZ Which opponent will be easy for teamindia to face in champions trophy 2025 final

అదే న్యూజిలాండ్ విషయానికొస్తే భారత్ కాస్త జాగ్రత్తగా ఆడాల్సి ఉంటుంది. కివీస్ నుంచి మనోళ్లకు ముప్పు ఉంటుంది. చివరి లీగ్ మ్యాచ్ లోనూ వాళ్లు ఓడిపోయినప్పటికీ భారత్ పై గట్టిగానే ఒత్తిడి తీసుకొచ్చారు. పైగా దుబాయ్ పిచ్ స్పిన్ బౌలింగ్ ఫేవర్ గా ఉన్న నేపథ్యంలో వారు కూడా నలుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగి మనోళ్లకు సవాలు విసిరారు. అదే భారత్ కు మరింత ప్రమాదకరం. పైగా ఆ జట్టులో కీలక ఆటగాళ్లు చాలా మందే ఉన్నారు. సింగిల్ హ్యాండ్ తో మ్యాచ్ ను మలుపు తిప్పగలిగే సత్తా ఉన్న ప్లేయర్స్ ఉన్నారు. సౌతాఫ్రికా కు కూడా తక్కువేం కాదు. బ్యాటింగ్ బౌలింగ్ లో బలంగానే ఉన్నప్పటికీ, ఆ జట్టును సమర్థవంతంగా ఎదుర్కొని ఓడించగల అనుభవం మనోళ్లకు ఎక్కువగానే ఉంది. కాబట్టి సౌతాఫ్రికాతో పోలిస్తే న్యూజిలాండ్ ను ఎదుర్కోవడమే భారత్ కు కాస్త కష్టం అని చెప్పాలి. అందుకే చాలా మంది రెండో సెమీస్ లో సఫారీలు గెలిచి తుది పోరుకు అర్హత సాధించాలని ఆశిస్తున్నారు. అప్పుడే భారత్ మంచిదని అభిప్రాయపడుతున్నారు. లెట్స్ వెయిట్ అండ్ సీ ఏం జరుగుతుందో..

Story first published: Wednesday, March 5, 2025, 17:01 [IST]
Other articles published on Mar 5, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+