Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

చరిత్ర సృష్టించిన రచిన్ రవీంద్ర - సచిన్‌ టెండూల్కర్ రికార్డ్ బ్రేక్!

న్యూజిలాండ్ ఆల్ రౌండర్, భారత సంతతి కుర్రాడు రచిన్ రవీంద్ర తన అద్భుతమైన ఆటతీరుతో తరచుగా క్రికెట్ అభిమానుల్లో నోళ్లలో చర్చనీయాంశంగా మారుతూనే ఉన్నాడు. ప్రస్తుతం అతడి గణాంకాలు చూస్తుంటే ఐసీసీ టోర్నమెంట్లలో సెంచరీలు చేయడం అలవాటుగా చేసుకున్నట్లు అనిపిస్తోంది.

తాజాగా దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న ఛాంపియన్స్ ట్రోఫీ 2025 రెండో సెమీఫైనల్ లోనూ రచిన్ తన సెంచరీ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. 93 బంతుల్లో 13 ఫోర్లు 1 సిక్స్ సాయంతో శతకం నమోదు చేశాడు. మొత్తంగా 101 బంతుల్లో 13 ఫోర్లు 1 సిక్స్ ల సాయంతో 108 పరుగులు చేశాడు. వన్డేల్లో రచిన్ కు 5వ సెంచరీ కావడం విశేషం.అయితే అతడు రబాడా బౌలింగ్ లో కీపర్ హెన్రిచ్ క్లాసెన్ కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. ఈ ప్రదర్శనతో క్రికెట్ అభిమానులు అతడిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

SA VS NZ Rachin Ravindra century Creates History becomes youngest first player in icc tournaments

అన్నీ వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీలలోనే..
రచిన్ రవీంద్ర తన మొత్తంగా 13 ఇన్నింగ్స్‌లలో ఏకంగా 5 సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలు చేయడం విశేషం. తాజా సెంచరీ (ఛాంపియన్స్ ట్రోఫీ సౌతాఫ్రికాపై).. వన్లేల్లో అతడికి ఐదో శతకం. మరో విషయమేమిటంటే..ఈ ఐదు సెంచరీలనీ అతడు ఐసీసీ టోర్నమెంట్ లలోనే సాధించాడు. 2023 ప్రపంచ కప్‌లలో 3 శతకాలు, ఛాంపియన్స్ ట్రోఫీలో 2 సెంచరీలు బాదాడు.

108 వర్సెస్ సౌతాఫ్రికా ఛాంపియన్స్ ట్రోఫీ
112 వర్సెస్ బంగ్లాదేశ్ ఛాంపియన్స్ ట్రోఫీ,
108 వర్సెస్ పాకిస్థాన్ వరల్డ్ కప్
116 వర్సెస్ ఆస్ట్రేలియా వరల్డ్ కప్
123* వర్సెస్ ఇంగ్లాండ్ వరల్డ్ కప్
75 వర్సెస్ భారత్ వరల్డ్ కప్
52 వర్సెస్ నెదర్లాండ్స్ వరల్డ్ కప్

సచిన్, రచిన్ మాత్రమే..
ఈ ఐసీసీ టోర్నమెంట్లలో రచిన్ సెంచరీలను 25ఏళ్ల వయసులో సాధించడం గొప్ప విషయమనే చెప్పాలి. తద్వారా ఐసీసీ వన్డే ఈవెంట్లలో ఐదు శతకాలు నమోదు చేసిన యంగెస్ట్ ప్లేయర్ గా (25) నిలిచాడు. అలానే ఐసీసీ టోర్నమెంట్లలో 25 ఏళ్ల వయసులోనే ఐదు శతకాలు బాదిన తొలి ప్లేయర్ గా (ప్రపంచంలోనే) నిలిచాడు. అంతకుముందు సచిన్ తెందుల్కర్ 3 శతకాలతో ఈ జాబితాలో ముందున్నాడు.

Story first published: Wednesday, March 5, 2025, 19:01 [IST]
Other articles published on Mar 5, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+