దక్షిణాఫ్రికాతో జరుగుతున్న నాలుగు టీ20ల సిరీస్‌ను భారత్ ఘనంగా బోణీ కొట్టింది. శుక్రవారం డర్బన్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో టీమిండియా 61 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆల్‌రౌండ్ షోతో సత్తాచాటి సఫారీలను చిత్తు చేసింది. మొదట భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 202 పరుగులు చేసింది. సంజు శాంసన్ (107; 50 బంతుల్లో, 7 ఫోర్లు, 10 సిక్సర్లు) సెంచరీతో చెలరేగాడు.
తిలక్ వర్మ (33; 18 బంతుల్లో, 3 ఫోర్లు, 2 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (21; 17 బంతుల్లో, 2 ఫోర్లు, 1 సిక్సర్) పరుగులు చేశారు. సౌతాఫ్రికా బౌలర్లలో కొయెట్జి మూడు వికెట్లు, మార్కో జేన్సన్, కేశవ్ మహరాజ్, పీటర్, క్రుగర్ తలో వికెట్ తీశారు. అనంతరం ఛేదనలో సౌతాఫ్రికా 17.5 ఓవర్లలో 141 పరుగులకే కుప్పకూలింది. హెన్రిచ్ క్లాసెన్ (25; 22 బంతుల్లో, 2 ఫోర్లు, 1 సిక్సర్) టాప్ స్కోరర్. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్ చెరో మూడు వికెట్లు, అవేశ్ ఖాన్ రెండు, అర్షదీప్ సింగ్ ఒక్క వికెట్ తీశారు.

కాగా, శతకంతో కదం తొక్కిన సంజు శాంసన్ పలు రికార్డులు బద్దలుకొట్టాడు. అంతర్జాతీయ టీ20ల్లో వరుసగా రెండు సెంచరీలు సాధించిన తొలి భారత బ్యాటర్‌గా రికార్డులకెక్కాడు. ఓవరాల్‌గా నాలుగో బ్యాటర్ శాంసన్. అతని కంటే ముందు గుస్తావ్ మెకియాన్, రొసోవ్, ఫిల్ సాల్ట్ ఈ ఘనత సాధించారు. ఇక భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా టీ20ల్లో అత్యధిక స్కోరు సాధించిన ప్లేయర్‌గా శాంసన్ చరిత్రకెక్కాడు. అంతకుముందు ఈ రికార్డు డేవిడ్ మిల్లర్ (106 నాటౌట్) పేరిట ఉండేది.

రోహిత్ శర్మ ఆల్‌టైమ్ రికార్డును కూడా సంజు శాంసన్ సమం చేశాడు. ఓ టీ20 ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు సాధించిన భారత బ్యాటర్‌గా రోహిత్ సరసన సంజు శాంసన్ నిలిచాడు. 2017లో ఇండోర్ వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో హిట్ మ్యాన్ 10 సిక్సర్లు బాదాడు. ఇప్పుడు ఈ రికార్డు డర్బన్‌లో శాంసన్ సమం చేశాడు. ఇక భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా టీ20ల్లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్‌గా శాంసన్ మరో ఘనత సాధించాడు. అంతకుముందు ఈ రికార్డు సూర్యకుమార్ యాదవ్, రొసోవ్ పేరిట ఉండేది. వీరిద్దరు 9 సిక్సర్లు సాధించారు.
Sanju Chetta is on fire! 🔥💥
— JioCinema (@JioCinema) November 8, 2024
Watch the 1st #SAvIND T20I LIVE on #JioCinema, #Sports18, and #ColorsCineplex! 👈#TeamIndia #JioCinemaSports #SanjuSamson pic.twitter.com/kTeX4Wf6AQ