Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SA vs BAN: ఆదుకున్న బవుమా.. బంగ్లాపై దక్షిణాఫ్రికా ఘన విజయం! సెమీస్ దిశగా సఫారీలు!!

SA vs BAN: Rabada, Nortje and Bavumas super performance helps South Africa beat Bangladesh

అబుదాబి: టీ20 ప్రపంచకప్ 2021 సూపర్ 12లో భాగంగా బంగ్లాదేశ్‌ నిర్ధేశించిన స్వల్ప లక్ష్య ఛేదనలో తడబడిన దక్షిణాఫ్రికా.. చివరకు విజయాన్ని అందుకుంది. 85 పరుగుల లక్ష్యాన్ని సఫారీలు 13.3 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించారు. వాన్ డర్ డస్సెన్‌ (22), టెంబా బవుమా (31 నాటౌట్)లు జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. బంగ్లా బౌలర్లలో తస్కిన్ అహ్మద్ 2 వికెట్లు పడగొట్టాడు. ఈ విజయంతో ప్రొటీస్ సెమీస్ చేరేందుకు మరో అడుగు ముందుకు వేసింది. దక్షిణాఫ్రికా ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచుల్లో మూడు విజయాలు అందుకుని ఆరు పాయింట్లతో పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. ఇంగ్లండ్ (8), ఆస్ట్రేలియా (4)లు దక్షిణాఫ్రికాకు పోటీలో ఉన్నాయి.

 33 పరుగులకే మూడు వికెట్లు:

33 పరుగులకే మూడు వికెట్లు:

స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన దక్షిణాఫ్రికా.. పవర్‌ ప్లే పూర్తయ్యేసరికి మూడు వికెట్లు కోల్పోయి 33 పరుగులు చేసింది. తొలి ఓవర్లోనే ఓపెనర్‌ రీజా హెండ్రిక్స్‌ (4) ఎల్బీగా వెనుదిరిగాడు. మరో ఓపెనర్‌ క్వింటన్‌ డి కాక్‌ (16) ఐదో ఓవర్లో బౌల్డయ్యాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కి వచ్చిన ఐడెన్‌ మార్‌క్రమ్‌ (0) డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కి వచ్చిన కెప్టెన్‌ టెంబా బావుమా (25).. వాండర్‌ డస్సెన్‌ (22)తో కలిసి నిలకడగా ఆడుతూ పరుగులు చేశారు. ఈ క్రమంలోనే నసూమ్‌ అహ్మద్‌ వేసన 13 ఓవర్లో డస్సెన్‌ క్యాచ్‌ ఔట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన డేవిడ్‌ మిల్లర్‌ (5) మిగతాపని పూర్తిచేశాడు. బంగ్లా బౌలర్లలో టస్కిన్‌ అహ్మద్‌ రెండు, మెహెదీ హసన్‌, నసూమ్‌ అహ్మద్‌ తలో వికెట్ తీశారు.

షాకిచ్చిన రబాడ:

షాకిచ్చిన రబాడ:

అంతకుముందు బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 18.2 ఓవర్లలో 84 పరుగులకే ఆలౌట్ అయింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాకు శుభారంభం దక్కలేదు. నాలుగో ఓవర్లో వరుస బంతుల్లో రెండు వికెట్లు తీసిన స్టార్ పేసర్ కాగిసో రబాడ బంగ్లాను కోలుకోలేని దెబ్బ కొట్టాడు. ఓపెనర్ మొహమ్మద్ నైమ్ (9), సౌమ్య సర్కార్ (0)లను రబాడ పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత ఆరో ఓవర్లో మరోసారి బంగ్లాకు రబాడ షాక్ ఇచ్చాడు. ఇక బంగ్లా అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్న ముష్ఫికర్ రహీమ్ (0)ను డకౌట్ చేశాడు. ఆ తర్వాత ఏ దశలోనూ బంగ్లాదేశ్ కోలుకోలేదు. సీనియర్ ప్లేయర్ లిటాన్ దాస్ (24) కాసేపు నిలబడినా.. అతనికి అవతలి ఎండ్ నుంచి ఎటువంటి సహకారం అందలేదు. దాంతో బంగ్లా స్కోర్ బోర్డు ముందుకు కదల్లేకపోయింది.

నోర్జ్, షంసీల దెబ్బ:

నోర్జ్, షంసీల దెబ్బ:

మధ్య ఓవర్లలో ఆన్రిచ్ నోర్జ్, తబ్రయిజ్ షంసీ చెలరేగడంతో కెప్టెన్ మహ్మదుల్లా (3), ఆఫిఫ్ హొస్సేన్ (0), షమీమ్ హొస్సేన్ (11), తస్కిన్ అహ్మద్ (3), నాసుమ్ అహ్మద్ (0) క్రీజులో నిలబడలేకపోయారు. జట్టు స్కోరును కనీసం 100 పరుగులు దాటిస్తాడని అనుకున్న మెహెదీ హసన్ (27) కూడా షంసీ బౌలింగ్‌లో అవుటయ్యాడు. ఇన్నింగ్స్ చివరలో నాసుమ్ అహ్మద్ (0), షోరిఫుల్ ఇస్లామ్ (0), తస్కిన్ అహ్మద్ (3) పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. ఈ క్రమంలో బంగ్లా 84 పరుగులకే ఆలౌట్ అయింది. సఫారీ బౌలర్లలో రబాడ, నోర్జ్ చెరో మూడు వికెట్లు పడగొట్టగా.. షంసీ 2, ప్రిటోరియస్ ఒక వికెట్ తీశారు.

Story first published: Tuesday, November 2, 2021, 19:14 [IST]
Other articles published on Nov 2, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+