Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SA vs BAN: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా.. ముస్తాఫిజుర్, షకీబ్ ఔట్!!

SA vs BAN Playing 11 is Out: Mustafizur, Shakib is out and Taskin Ahmed in for Bangladesh

అబుదాబి: టీ20 ప్రపంచకప్‌ 2021 సూపర్ 12లో భాగంగా మరికొద్దిసేపట్లో దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ జట్లు తలపడనున్నాయి. అబుదాబి మైదానంలో మధ్యాహ్నం 3.30 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచులో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా కెప్టెన్ తెంబా బవుమా బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ కోసం ప్రొటీస్ ఎలాంటి మార్పులు చేయలేదు. మరోవైపు బంగ్లాదేశ్ జట్టులో రెండు మార్పులు జరిగినట్లు కెప్టెన్ మహ్మదుల్లా వెల్లడించాడు. గాయంతో స్టార్ ఆల్‌రౌండర్ షకీబల్ హసన్ ఆడటం లేదని, అతని స్థానంలో షమీమ్ హొస్సేన్‌ను జట్టులోకి వచ్చాడని చెప్పాడు. అలాగే పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ స్థానంలో నాసుమ్ అహ్మద్‌ తుది జట్టులోకి వచ్చాడని మహ్మదుల్లా తెలిపాడు.

గత రెండు మ్యాచ్‌ల్లో వరుస విజయాలతో దక్షిణాఫ్రికా జట్టులో మంచి ఆత్మవిశ్వాసం పెరిగింది. వెస్టిండీస్, శ్రీలంకపై విజయాలు సెమీ-ఫైనల్స్ కోసం దక్షిణాఫ్రికాను బలమైన పోటీదారుగా చేశాయి. మూడు మ్యాచ్‌లలో నాలుగు పాయింట్లు, నెట్ రన్ రేట్‌లో ఆస్ట్రేలియా కంటే మెరుగ్గా ప్రొటీస్ కనిపిస్తోంది. దీంతో సెమీ ఫైనల్ ఆశలను నిలబెట్టుకునేందుకు ఈ మ్యాచులో ఎలాగైనా గెలవాలని కోరుకుంటుంది. మరోవైపు బంగ్లాదేశ్ సూపర్ 12లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఒక్కటి కూడా గెలవలేకపోయింది. దాంతో సెమీ ఫైనల్‌కు చేరుకోవాలనే వారి ఆశలు దాదాపుగా ముగిశాయి. అయితే విజయాలతో అయినా టోర్నినుంచి నిష్క్రమించాలని బంగ్లా చూస్తోంది.

ఇప్పటివరకు దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ జట్లు 6 టీ20 మ్యాచుల్లో తలపడ్డాయి. ఇందులో బంగ్లాదేశ్ ఒక్క మ్యాచులో కూడా విజయం సాధించలేదు. దక్షిణాఫ్రికా 6 మ్యాచుల్లోనూ విజయం సాధిచింది. ఇక టీ20 ప్రపంచకప్‌లో ఇప్పటి వరకు ఇరు జట్లు ఒక గేమ్‌లో తలడ్డాయి. ఇందులోనూ దక్షిణాఫ్రికా విజయం సాధిచింది. ఈ మ్యాచ్‌ను స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ఛానెల్‌లలో వివిధ భాషలలో చూడవచ్చు. డిస్నీ+హాట్‌స్టార్‌లో లైవ్ స్ట్రీమింగ్ సబ్‌స్క్రిప్షన్‌తో అభిమానులు మ్యాచ్‌ను ఆన్‌లైన్‌లో చూడొచ్చు.

తుది జట్లు:
దక్షిణాఫ్రికా: రీజా హెండ్రిక్స్, క్వింటన్ డికాక్, రాసీ వ్యాన్ డర్ డస్సెన్, టెంబా బవుమా, ఎయిడెన్ మార్క్రమ్, డేవిడ్ మిల్లర్, డ్వెయిన్ ప్రిటోరియస్, కగిసో రబాడ, కేశవ్ మహారాజ్, ఆన్రిచ్ నోర్జ్, తబ్రయిజ్ షంసీ.
బంగ్లాదేశ్: మొహమ్మద్ నైమ్, లిటాన్ దాస్, షమీమ్ హొస్సేన్, సౌమ్య సర్కార్, ముష్ఫికర్ రహీమ్, మహ్మదుల్లా, ఆతిఫ్ హొస్సేన్, మెహదీ హసన్, నాసుమ్ అహ్మద్, షోరిఫుల్ ఇస్లామ్, తస్కిన్ అహ్మద్.

Story first published: Tuesday, November 2, 2021, 15:56 [IST]
Other articles published on Nov 2, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+