Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SA vs BAN: మూడేసి రబాడ, నోర్జ్.. బంగ్లాదేశ్ ఆలౌట్! దక్షిణాఫ్రికా ముందు స్వల్ప లక్ష్యం!

SA vs BAN: Kagiso Rabada and Anrich Nortje picked up three wickets each, Bangladesh fold for 84

అబుదాబి: దక్షిణాఫ్రికా బౌలర్ల ముందు బంగ్లాదేశ్ నిలవలేకపోయింది. పేసర్లు కాగిసో రబాడ, ఆన్రిచ్ నోర్జ్.. స్పిన్నర్ తబ్రయిజ్ షంసీ దాటికి బంగ్లా 18.2 ఓవర్లలో 84 పరుగులకే ఆలౌట్ అయింది. దాంతో ప్రొటీస్ ముందు కేవలం 85 పరుగుల లక్ష్యం మాత్రమే ఉంది. బంగ్లా బ్యాటరలలో మెహదీ హసన్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. హసన్ 25 బంతుల్లో 27 పరుగులు చేశాడు. వికెట్ కీపర్ లిటాన్ దాస్ 36 బంతుల్లో 24 రన్స్ చేశాడు. బంగ్లా స్టార్ ప్లేయర్స్ సౌమ్య సర్కార్ (0), ముష్ఫికర్ రహీమ్ (0), మహ్మదుల్లా (3) పూర్తిగా విఫలమయ్యారు. ఇక ప్రొటీస్ పేసర్లు రబాడ, నోర్జ్ తలో మూడు వికెట్లు పడగొట్టగా.. షంసీ రెండు వికెట్లు తీశాడు.

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాకు శుభారంభం దక్కలేదు. నాలుగో ఓవర్లో వరుస బంతుల్లో రెండు వికెట్లు తీసిన స్టార్ పేసర్ కాగిసో రబాడ బంగ్లాను కోలుకోలేని దెబ్బ కొట్టాడు. ఓపెనర్ మొహమ్మద్ నైమ్ (9), సౌమ్య సర్కార్ (0)లను రబాడ పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత ఆరో ఓవర్లో మరోసారి బంగ్లాను రబాడ దెబ్బకొట్టాడు. బంగ్లా అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్న ముష్ఫికర్ రహీమ్ (0)ను డకౌట్ చేశాడు. ఆ తర్వాత ఏ దశలోనూ బంగ్లాదేశ్ కోలుకోలేదు. సీనియర్ ప్లేయర్ లిటాన్ దాస్ (24) కాసేపు నిలబడినా.. అతనికి అవతలి ఎండ్ నుంచి ఎటువంటి సహకారం అందలేదు. దాంతో బంగ్లా టైగర్స్ స్కోర్ బోర్డు ముందుకు కదల్లేకపోయింది.

ఆన్రిచ్ నోర్జ్, తబ్రయిజ్ షంసీ చెలరేగడంతో కెప్టెన్ మహ్మదుల్లా (3), ఆఫిఫ్ హొస్సేన్ (0), షమీమ్ హొస్సేన్ (11), తస్కిన్ అహ్మద్ (3), నాసుమ్ అహ్మద్ (0) క్రీజులో నిలబడలేకపోయారు. జట్టు స్కోరును కనీసం 100 పరుగులు దాటిస్తాడని అనుకున్న మెహెదీ హసన్ (27) కూడా షంసీ బౌలింగ్‌లో అవుటయ్యాడు. నాసుమ్ అహ్మద్ (0), షోరిఫుల్ ఇస్లామ్ (0), తస్కిన్ అహ్మద్ (3) పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. ఈ క్రమంలో బంగ్లా 84 పరుగులకే ఆలౌట్ అయింది. సఫారీ బౌలర్లలో రబాడ, నోర్జ్ చెరో మూడు వికెట్లు పడగొట్టగా.. షంసీ 2, ప్రిటోరియస్ ఒక వికెట్ తీశారు.

Story first published: Tuesday, November 2, 2021, 17:45 [IST]
Other articles published on Nov 2, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+