మూడో టెస్టు: ఎల్గర్ సెంచరీ, దక్షిణాఫ్రికా 266/8

హైదరాబాద్: కేప్‌టౌన్ వేదికగా ఆతిథ్య దక్షిణాఫ్రికా-ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడో టెస్టు గురువారం ప్రారంభమైంది. ఓపెనర్ డీన్ ఎల్గర్ (121 బ్యాటింగ్) అజేయ సెంచరీతో రాణించినా ఆతిథ్య దక్షిణాఫ్రికా భారీ స్కోరు చేయడంలో విఫలమైంది. దీంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి 266 పరుగులు సాధించింది.
చిన్నారి సంప్రీతి కీమోథెరపీ సాయం కోసం ఓ వెయిటర్ తండ్రి ఆవేదన
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా స్టార్ బ్యాట్స్‌మెన్ ఏబీ డివిలియర్స్ (64) కీలక ఇన్నింగ్స్ ఆడగా, మరో ఓపెనర్ ఆమ్లా (31)తో ఫరవాలేదనిపించాడు. మిగతా వారంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. ఎల్గర్, డివిలియర్స్ మూడో వికెట్‌కు 128 పరుగులు జోడించడంతో దక్షిణాఫ్రికా ఓ దశలో 220/2తో పటిష్ట స్థితిలో నిలిచింది..
Australia vs South Africa 2018 3rd Test Score Card
ఈ సమయంలో కమిన్స్ (4/64) విజృంభించడంతో 37 పరుగుల వ్యవధిలో ఆరు వికెట్లను కోల్పోయింది. ప్రస్తుతం క్రీజులో డీన్ ఎల్గర్ (121), రబాడ (6) పరుగులతో క్రీజులో ఉన్నారు. ఆసీస్ బౌలర్లలో కమిన్స్‌కు నాలుగు, హాజెల్‌వుడ్‌కు రెండు వికెట్లు తీసుకున్నారు. నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇరు జట్లు 1-1తో సమంగా ఉన్నాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications