For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

డివిలియర్స్ ఈజ్ బ్యాక్: చివరి మూడు వన్డేలకు జట్టులో చోటు

AB de Villiers

హైదరాబాద్: ఆరు వన్డేల సిరిస్‌లో భాగంగా భారత్‌తో జరిగే చివరి మూడు వన్డేలకు దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు ఆ జట్టు స్టార్ ప్లేయర్ ఏబీ డివిలియర్స్ పేరుని 15 మంది జట్టు సభ్యుల్లో చేర్చింది. వరుసగా తొలి మూడు వన్డేల్లో ఓటమి పాలైన దక్షిణాఫ్రికా క్రికెట్ అభిమానులకు ఇది ఊరటనిచ్చే వార్త.

ఈ సిరిస్‌లో జోహెన్స్‌బర్గ్‌లోని వాండరర్స్ స్టేడియంలో శనివారం (ఫిబ్రవరి 10)న జరిగే నాలుగో వన్డేలో ఏబీ డివిలియర్స్ తిరిగి జట్టులోకి అడుగుపెట్టనున్నాడు. మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో చివరిదైన మూడో టెస్టులో కోహ్లీ ఇచ్చిన క్యాచ్‌ను అందుకునే క్రమంలో చేతి వేలు గాయం కారణంగా తొలి మూడు వన్డేలకు దూరమైన సంగతి తెలిసిందే.

ఆ తర్వాత రెండో వన్డేలో దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్, డికాక్ కూడా దూరం కావడంతో సఫారీ జట్టు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఆరు వన్డేల సిరిస్‌ను కాపాడుకోవాలంటే మిగతా మూడు మ్యాచ్‌ల్లో తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో డివిలియర్స్ తిరిగి జట్టులోకి అడుగు పెడుతుండటం ఆ జట్టులో నూతన ఉత్సాహాన్ని నింపింది.

ఏబీ డివిలియర్స్, డుప్లెసిస్ గైర్హాజరీలో భారత మణికట్టు స్పిన్నర్లు యజువేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్‌లను ఎదుర్కోవడంలో సపారీ బ్యాట్స్‌మెన్ తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. మూడు మ్యాచ్‌ల్లో కలిపి వీరిద్దరూ 21 వికెట్లు తీసి సఫారీలను తీవ్ర ఒత్తిడిలోకి నెట్టారు. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలో తోచని స్థితిలో సఫారీ బ్యాట్స్‌మెన్ ఉన్నారు.

ఇలాంటి సమయంలో డవిలియర్స్ తిరిగి జట్టులోకి రావడం జట్టులో ఆత్మవిశ్వాసం నింపుతుందని డుమిని చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. 'నాలుగో వన్డేలో ఏబీ డివిలియర్స్ జట్టులోకి రావడం మా అందరికీ కొంతమేరకు ఉత్సాహాన్నిస్తుంది. వన్డే క్రికెట్‌లో ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాళ్లలో డివిలియర్స్ ఒకడు. గాయం కారణంగా భారత్‌తో తొలి మూడు వన్డేలకు దూరమయ్యాడు. అతని పునరాగమనంతో జట్టులో ఉత్సాహం రెట్టింపవుతుంది' అని అన్నాడు.

'ఒత్తిడి నుంచి కోలుకుని మిగతా మూడు వన్డేల్లో సత్తా చాటుతాం జట్టులో అతడు ఆత్మవిశ్వాసాన్ని నింపగలడు. శనివారం జొహానెస్‌బర్గ్‌లో ఇరు జట్ల మధ్య నాలుగో వన్డే జరగనుంది. ఈ వన్డేకు డివిలియర్స్‌ అందుబాటులో ఉంటాడు. సిరీస్‌ ఇంకా భారత్‌ వశం కాలేదు. ఇంకా మూడు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి' అని డుమిని పేర్కొన్నాడు.

చివరి మూడు వన్డేలకు దక్షిణాఫ్రికా జట్టు:
Aiden Markram (Capt), Hashim Amla, AB de Villiers, JP Duminy, Imran Tahir, Aiden Markram, David Miller, Morne Morkel, Chris Morris, Lungi Ngidi, Andile Phehlukwayo, Kagiso Rabada, Tabraiz Shamsi, Khayelihle Zondo, Farhaan Behardien.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Thursday, February 8, 2018, 22:57 [IST]
Other articles published on Feb 8, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+