Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

శ్రీశాంత్ ఏం మారలేదుగా.. తొలి మ్యాచ్‌లోనే స్లెడ్జింగ్‌ (వీడియో)!!

S Sreesanth starts sledging in Syed Mushtaq Ali T20 warmups

తిరువనంతపురం: స్పాట్‌ ఫిక్సింగ్ ఆరోపణలతో దాదాపు ఏడేళ్లుగా క్రికెట్‌‌కు దూరమైన భారత పేసర్ ఎస్ శ్రీశాంత్ గురువారం మైదానంలోకి అడుగుపెట్టాడు. జనవరి 10 నుంచి సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీ జరగనుండగా.. కేరళ జట్టు‌లోకి ఎంపికైన శ్రీశాంత్ ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడుతున్నాడు. అయితే శ్రీశాంత్ ఏం మారలేదు. గతంలో ప్రదర్శించిన దూకుడును అలానే కొనసాగిస్తున్నాడు. రీఎంట్రీ మ్యాచ్‌లోనే కేరళ జట్టులోని సహచర బ్యాట్స్‌మెన్‌పై అతను స్లెడ్జింగ్‌కి దిగాడు.

సహచర బ్యాట్స్‌మెన్‌పై స్లెడ్జింగ్:

సహచర బ్యాట్స్‌మెన్‌పై స్లెడ్జింగ్:

2013 తర్వాత మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టినప్పటికీ శ్రీశాంత్.. మునుపటి తరహాలోనే బంతులు సంధిస్తూ కనిపించాడు. బౌలింగ్ యాక్షన్ కొద్దిగా మారినప్పటికీ.. వేగంగానే బంతులు విసురుతున్నాడు. అతను లయ అందుకుని వికెట్లు కూడా పడగొట్టాడు. దాంతో సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీలో శ్రీశాంత్ ఆడటం లాంఛనంగానే కనిపిస్తోంది. అయితే శ్రీశాంత్ తన దూకుడును మాత్రం ఏమాత్రం తగ్గించుకోలేదు. సహచర బ్యాట్స్‌మెన్‌పై అతను స్లెడ్జింగ్‌కి దిగాడు. బ్యాట్స్‌మెన్‌ ఔట్ అయిన సమయంలో, షాట్ ఆడిన సమయంలో శ్రీశాంత్ ఆవేశానికి లోనయ్యాడు.

ఏం మారలేదుగా:

రీఎంట్రీ మ్యాచ్‌లోనే కేరళ టీమ్‌లోని సహచర బ్యాట్స్‌మెన్‌పై ఎస్ శ్రీశాంత్ స్లెడ్జింగ్‌కి దిగడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. దీనికి సంబందించిన వీడియో నెట్టింట వైరల్ అయింది. శ్రీశాంత్ ఏం మారలేదుగా అంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. ఇన్నిం రోజులు ఆటకు దూరంగా ఉన్నా.. అతడి బౌలింగ్‌లో మాత్రం పదును తగ్గలేదు. సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీలో 37 ఏళ్ల శ్రీశాంత్ సత్తాచాటితే.. ఐపీఎల్ 2021లోనూ అతను ఆడే అవకాశం ఉంది. టీ20 ట్రోఫీలో శ్రీశాంత్ ఎలాంటి ప్రదర్శనతో ఆకట్టుకుంటాడో చూడాలి.

మొదటి దేశవాళీ టోర్నీ:

మొదటి దేశవాళీ టోర్నీ:

ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఎస్ శ్రీశాంత్‌పై విధించిన ఏడేళ్ల నిషేధం ముగిసింది. నిషేధం ముగిసిన తర్వాత శ్రీశాంత్‌ ఆడే మొదటి దేశవాళీ టోర్నీ ఇదే. శ్రీశాంత్‌ భారత్‌ తరఫున 27 టెస్టులు ఆడి 87 వికెట్లు పడగొట్టాడు. 53 వన్డేల్లో 75 వికెట్లు, 10 టీ20ల్లో 7 వికెట్లు తీశాడు. 2007లో టీ20 ప్రపంచకప్, 2011లో వన్డే వరల్డ్‌కప్‌ నెగ్గిన జట్లలో శ్రీశాంత్‌ సభ్యుడు కావడం విశేషం.

ఐపీఎల్‌లో ఆడుతూ:

ఐపీఎల్‌లో ఆడుతూ:

శ్రీశాంత్‌ 2013 ఐపీఎల్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ జట్టు తరఫున ఆడుతూ.. స్పాట్‌ ఫిక్సింగ్‌ ఉదంతంలో దోషిగా తేలాడు. దీంతో బీసీసీఐ ఎలాంటి క్రికెట్‌ ఆడకుండా అతనిపై జీవితకాల నిషేధం విధించింది. జీవితకాల నిషేధంను శ్రీశాంత్‌ సవాల్‌ చేస్తూ కోర్టులో పోరాడాడు. హైకోర్టు కూడా అతనిపై నిషేధాన్ని సమర్థించింది. అయితే సుప్రీం కోర్టులో మాత్రం ఈ కేరళ పేసర్‌కు ఊరట లభించింది. శ్రీశాంత్‌ను దోషిగానే గుర్తించిన సుప్రీం.. జీవిత కాల శిక్షను మాత్రమే తగ్గించమంటూ బీసీసీఐకి సూచించింది. దాంతో అతని శిక్షను ఏడేళ్లకు తగ్గిస్తూ బోర్డు అంబుడ్స్‌మన్‌ డీకే జైన్‌ 2019లో నిర్ణయం తీసుకున్నాడు. ఈ ఏడాది సెప్టెంబరుతో శ్రీశాంత్‌ శిక్షాకాలం పూర్తయింది.

Story first published: Friday, January 1, 2021, 14:34 [IST]
Other articles published on Jan 1, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+