Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఏదైనా ఇక అక్కడే తేల్చుకుంటా: జీవితకాల నిషేధంపై శ్రీశాంత్‌!

హైదరాబాద్: 2013 స్పాట్‌ ఫిక్సింగ్‌ కుంభకోణానికి సంబంధించి తనపై బీసీసీఐ జీవితకాల విధించిన నిషేధాన్ని సుప్రీం కోర్టులో తేల్చుకుంటానని కేరళ క్రికెటర్‌ శ్రీశాంత్‌ అన్నాడు. కేరళ హైకోర్టుకు చెందిన ఏక సభ్య ధర్మాసనం కొన్ని నెలల కిందట అతడిపై నిషేధాన్ని రద్దు చేస్తూ తీర్పు ఇచ్చింది.

ఈ తీర్పుపై బీసీసీఐ తిరిగి హైకోర్టుని ఆశ్రయించగా అనంతరం అదే కోర్టు నిషేధాన్ని కొనసాగించాలని ఉత్తర్వులిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టుని ఆశ్రయించాలన్న నిర్ణయానికి శ్రీశాంత్‌ వచ్చాడు. 'నాకు ఇక ఉన్న ఒక్క అవకాశం సుప్రీం కోర్టుని ఆశ్రయించడమే. ఏదైనా ఇక అక్కడే తేల్చుకుంటా' అని శ్రీశాంత్ అన్నాడు.

 క్రికెట్‌ ఆడటం నా హక్కు

క్రికెట్‌ ఆడటం నా హక్కు

'క్రికెట్‌ మినహా నా జీవితంలో అన్నీ సవ్యంగా సాగుతున్నాయి. క్రికెట్‌ ఆడటం నా హక్కు. ఆ హక్కు కోసం నేను సుప్రీం కోర్టులో పోరాడతా. ఈ పోరాటం కేవలం దేశానికి ఆడటం కోసం మాత్రమే కాదు. నా పరువు ప్రతిష్టల్ని తిరిగి పొందడానికి. ఈ నాలుగేళ్లు వేచి చూశా. కానీ ఇక మౌనంగా ఉండలేను' అని శ్రీశాంత్‌ అన్నాడు.

 అసలేం జరిగింది?

అసలేం జరిగింది?

2013 ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సీజన్‌లో మ్యాచ్‌ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడని ఆరోపిస్తూ శ్రీశాంత్‌పై బీసీసీఐ జీవితకాల నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అయితే శ్రీశాంత్‌పై బోర్డు విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తూ కేరళ హైకోర్టు ఏక సభ్య ధర్మాసనం ఆగస్టు 7న తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే.

 శ్రీశాంత్‌పై నిషేధాన్ని కొనసాగించిన హైకోర్టు

శ్రీశాంత్‌పై నిషేధాన్ని కొనసాగించిన హైకోర్టు

శ్రీశాంత్‌పై విధించిన జీవితకాల నిషేధాన్ని ఎత్తివేస్తూ కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై బీసీసీఐ తిరిగి కోర్టును ఆశ్రయించింది. దీంతో (అక్టోబర్ 17) మంగళవారం ఈ కేసును విచారించిన చీఫ్‌ జస్టిస్‌ నవనీతి ప్రసాద్‌ సింగ్, జస్టిస్‌ రాజా విజయరాఘవన్‌లతో కూడిన డివిజన్‌ బెంచ్‌ సింగిల్‌ జడ్జి తీర్పును కొట్టివేసి, శ్రీశాంత్ నిషేధాన్ని కొనసాగించింది.

ఇటీవల శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు

ఇదిలా ఉంటే ప్రస్తుతం భారత జట్టుతో పాటు ఐపీఎల్‌లో ఆడుతున్న వారిలో నలుగురైదుగురికి ఫిక్సింగ్‌తో సంబంధం ఉందని శ్రీశాంత్ వ్యాఖ్యానించినట్లు ఈ మేరకు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. 'ప్రస్తుతం టీమిండియాకు, ఐపీఎల్‌లో ఆడుతున్న వారిలో నలుగురైదుగురికి ఫిక్సింగ్‌తో సంబంధం ఉంది. కానీ బీసీసీఐ నా ఒక్కడిపైనే కక్ష సాధించింది. కొందరు క్రికెటర్లపై ఢిల్లీ పోలీసులు ఇది వరకే కేసులు నమోదు చేసిన విషయం అందరికీ తెలుసు. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపడితే ఫిక్సింగ్‌కు పాల్పడిన అందరి పేర్లు బయటకొస్తాయి' అని శ్రీశాంత్ అన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.

Story first published: Monday, November 13, 2017, 12:18 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+