న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

శ్రీశాంత్ భార్య.. శిల్పాశెట్టి భర్తల మధ్యలో డిష్యుం.. డిష్యూం

S Sreesanth considered suicide after IPL spot-fixing controversy? Ex-cricketer reveals details in Bigg Boss 12

ముంబై : బిగ్‌బాస్‌-12 రియాల్టీ షోలో పాల్గొని టీమిండియా మాజీ క్రికెటర్ శ్రీశాంత్ అందరి దృష్టిని ఆకర్షించాడు. షో ఆరంభం నుంచే హౌస్‌లో ఎప్పుడు ఎదో గొడవపడుతూ.. వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలుస్తున్నాడు. అయితే ఈ సారి తనపై వచ్చిన మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలపై హౌస్‌ మేట్స్‌తో మాట్లాడుతూ కన్నీటి పర్యంతమయ్యాడు. ఈ ఘటనతో తాను పూర్తిగా కుంగిపోయానని, ఆత్మహత్య చేసుకుందామని చాలాసార్లు అనుకున్నట్లు శ్రీశాంత్‌ ఆవేదన వ్యక్తం చేశాడు.

మైదానం వద్ద కూడా కనిపించవద్దని

క్రికెట్ మైదానం వద్ద కూడా కనిపించవద్దన్నారని, తన కొడుకు ఆటను చూడటానికి కూడా రావద్దన్నారని, మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్టు ఆధారాలు లేకపోయినా తనపై నింద మోపారని కన్నీరు పెట్టుకున్నాడు. ఈ వీడియో క్లిప్‌ను కలర్స్‌ టీవీ తమ సోషల్‌ మీడియా వేదికల్లో పోస్ట్‌ చేయగా వైరల్‌ అయింది. దీనిపై స్పందించిన హీరోయిన్ శిల్పాశెట్టి భర్త రాజస్థాన్ రాయల్స్ జట్టు సహజయమాని రాజ్ కుంద్రా ఫన్నీ ఎమోజీతో ఎపిక్ అని ఒక కామెంట్ పెట్టాడు. ఇలా స్పందించడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అయింది.

బాధను వెళ్లగక్కుతుంటే ఫన్నీగా ఉందా?

ఓ వైపు శ్రీశాంత్‌ తన బాధను వెళ్లగక్కుతుంటే నీకు ఫన్నీగా ఉందా? అని అతని అభిమానులు మండిపడుతున్నారు. ఈ కామెంట్‌ స్క్రీన్‌ షాట్‌ను ట్వీటర్‌లో షేర్‌ చేయడంతో.. రాజ్‌కుంద్రాపై శ్రీశాంత్‌ సతీమణి భువనేశ్వరి కుమారి కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది.

శ్రీశాంత్‌ వివాదం గురించి స్పష్టత రానట్టుంది.

‘ఈ మనిషికి శ్రీశాంత్‌ వివాదం గురించి స్పష్టత రానట్టుంది. బెట్టింగ్‌ పాల్పడనట్లు కోర్టే తీర్పునిచ్చిన సదరు వ్యక్తి కూడా కామెంట్‌ చేస్తున్నాడు. శ్రీశాంత్‌పై వచ్చిన ఆరోపణలు నిరాధారణమైనవని కోర్టు తీర్పునిచ్చిన విషయం తెలియనట్టుంది' అని ట్వీట్‌ చేసింది.

ఫిక్సింగ్‌ ఆరోపణలతో క్రికెట్‌‌కు దూరమై

ఫిక్సింగ్‌ ఆరోపణలతో క్రికెట్‌‌కు దూరమై

2013 ఐపీఎల్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ తరపున బరిలోకి దిగిన శ్రీశాంత్‌.. మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలతో క్రికెట్‌ దూరమయ్యాడు. ఈ విషయంలో ఎలాంటి సాక్ష్యాలు లభించకపోవడంతో 2015లో ఢిల్లీ కోర్టు శ్రీశాంత్‌పై వచ్చిన అభియోగాలను కొట్టేసింది. అయినా బీసీసీఐ శ్రీశాంత్‌పై నిషేధం ఎత్తేయలేదు.

Story first published: Tuesday, November 27, 2018, 19:04 [IST]
Other articles published on Nov 27, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X