For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బద్రినాథ్ 10,000: అరుదైన ఘనత

రంజీ క్రికెట్‌లో హైదరాబాద్ జట్టు కెప్టెన్‌గా ఉన్న బద్రీనాథ్ అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. రంజీ క్రికెట్‌లో పది వేల పరుగుల మైలు రాయిని అందుకున్న 47వ బ్యాట్స్‌మెన్‌గా అవతరించాడు.

By Nageshwara Rao

హైదరాబాద్: రంజీ క్రికెట్‌లో హైదరాబాద్ జట్టు కెప్టెన్‌గా ఉన్న బద్రీనాథ్ అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. రంజీ క్రికెట్‌లో పది వేల పరుగుల మైలు రాయిని అందుకున్న 47వ బ్యాట్స్‌మెన్‌గా అవతరించాడు. రంజీ ట్రోఫీలో భాగంగా ఛత్తీస్‌గఢ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బద్రీనాథ్ 134 పరుగుల సాధించడంతో పదివేల పరుగులను పూర్తి చేసుకున్నాడు.

తద్వారా రంజీల్లో పదివేల పరుగులను పూర్తి చేసుకున్న 47వ బ్యాట్స్‌మెన్‌గా అవతరించాడు. తన 16 ఏళ్ల సుదీర్ఘ ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో బద్రీనాథ్ 55.19 యావరేజితో 10,045 పరుగులు సాధించాడు. 2000-01 రంజీ సీజన్‌లో తమిళనాడు తరపున బద్రీనాథ్ ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు.

S Badrinath 'cherishes' crossing 10,000 first-class runs

2009లో ముంబైతో జరిగిన రంజీ మ్యాచ్‌లో బద్రినాథ్ అత్యధిక స్కోరు 250 పరుగులు సాధించాడు. ఇదే తన క్రికెట్ కెరీర్‌లో అత్యుత్తమ ఇన్నింగ్స్‌గా పేర్కొన్నాడు. అంతేకాదు రంజీల్లో తమిళనాడు జట్టు మూడు సార్లు ఫైనల్‌కు చేర్చడంలో కీలకపాత్ర పోషించాడు.

ఆ తర్వాత కాలంలో విదర్భ జట్టుకు ఆడిన బద్రినాథ్ ప్రస్తుతం రంజీల్లో హైదరాబాద్ జట్టు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. తాను విదర్భ జట్టు తరపున పాల్గొన్న తొలి సీజన్‌లోనే నాకౌట్‌కు అర్హత సాధించిందని బద్రినాథ్ తెలిపాడు.

చెన్నైలోని ఐఐటీ క్యాంపస్‌లోని 2000 సంవత్సరంలో కర్ణాటకతో జరిగిన రంజీ మ్యాచ్‌లో తన తొలి సెంచరీని సాధించానని చెప్పాడు. అది తన రెండో రంజీ మ్యాచ్ అని, రెండో మ్యాచ్‌లోనే సెంచరీ సాధించడం తనకు ఎంతో సంతోషానిచ్చిందని బద్రినాథ్ స్పష్టం చేశాడు.

ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో తనకు వసీం జాఫర్, రమేశ్ అంటే ఎంతో ఇష్టమని చెప్పాడు. విదర్భకు ఆడిన సమయంలో వసీం జాఫర్‌తో కలిసి డ్రెస్సింగ్ రూం షేర్ చేసుకోవడాన్ని లక్కీగా చెప్పుకొచ్చాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో మోస్ట్ ఛాలెంజింగ్ బౌలర్ ఎవరనే ప్రశ్నకు మాత్రం తమిళనాడుకు చెందిన ఎల్ బాలాజీ అని అన్నాడు.

తనకు ప్రేరణ కలిగించిన వాళ్లలో బాలాజీ ఒకడని పేర్కొన్నాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో పంకజ్ సింగ్ కూడా అత్యుత్తమ బౌలర్ అని కొనియాడాడు. బౌన్స్ వేయడమే కాకుండా, లాంగ్స్ స్పెల్స్ వేయడంలో పంకజ్ సింగ్ దిట్ట అని బద్రినాథ్ కొనియాడాడు.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+