రియాన్ పరాగ్ ఫీల్డింగ్ మస్తుందిగా.. అతని జోష్ అదిరిపోయిందన్న శ్రీలంకన్ స్టార్

శ్రీలంక మాజీ పేసర్, ప్రస్తుత రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ కోచ్ లసిత్ మలింగ.. ఆ జట్టు యువ ప్లేయర్ రియాన్ పరాగ్ ఫీల్డింగ్‌ను మెచ్చుకున్నాడు. ఐపీఎల్ 2022లో ఇప్పటివరకు తాను చూసిన బెస్ట్ ఫీల్డింగ్ ఎఫర్ట్స్‌లో యువ ఆల్ రౌండర్ రియాన్ పరాగ్ ఫీల్డింగ్ ఒకటని ప్రశంసించాడు. ఇక ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు రియాన్ చూపే ఉత్సాహం తనను ఎంతగానో ఆకట్టుకుందని మలింగ చెప్పాడు. ఇక ఈ సీజన్లో పరాగ్ 16క్యాచ్‌లు అందుకున్నాడు. ఐపీఎల్‌లో ఒకే ఎడిషన్‌లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఫీల్డర్ (వికెట్‌కీపర్ కాని)గా భారత సీనియర్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా రికార్డును రియాన్ పరాగ్ అధిగమించాడు. ఇక ఫీల్డింగ్లో కాస్త ఓవరాక్షన్ చేస్తున్నాడంటూ నెట్టింటా రియాన్ పరాగ్ పట్ల ట్రోల్స్ పెరుగుతున్న నేపథ్యంలో అతన్ని మలింగ్ సపోర్ట్ చేస్తూ కామెంట్లు చేయడం చర్చనీయాంశమైంది.
రియాన్ పరాగ్ అథ్లెటిక్ పర్సన్
'గత 15 మ్యాచ్‌ల్లో రియాన్ ఫీల్డింగ్ విధానాన్ని నేను నిజంగా ఆస్వాదిస్తున్నాను. అతనికి చాలా ఎనర్జీ ఉంది. అతను మంచి అథ్లెటిక్ కూడా. ఎప్పుడూ ఆటలో బెస్ట్ ఇవ్వడానికి చూస్తాడు. అతనికి బ్యాటింగ్ చేయడానికి అనుకున్నన్నీ అవకాశాలు రాలేదు. కానీ మైదానంలో అతను తన ఫీల్డింగ్ ద్వారా నింపే జోష్ మాత్రం అద్భుతం. మీరు ఇతర జట్టులో ఇలాంటి జోష్ చూసి ఉండరు. అతను జట్టులో చూపుతున్న ఎనర్జీ, వైఖరి పట్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఇది మాకు అవసరమైన వైఖరే' అని రాజస్థాన్ రాయల్స్ ఇన్‌స్టా హ్యాండిల్‌లో పోస్ట్ చేసిన వీడియోలో మలింగ చెప్పాడు.

రియాన్ పరాగ్ బ్యాటింగ్లో అంతంతమాత్రంగానే
ఈ సీజన్‌లో రియాన్ పరాగ్ 16 మ్యాచ్‌లు ఆడగా.. అతనికి 13 ఇన్నింగ్స్‌లలో బ్యాటింగ్ చేసే అవకాశం లభించింది. ఇక పరాగ్ ఎక్కువగా లోయర్ ఆర్డర్లో దిగడంతో అతనికి తగినంత కుదురుకునేందుకు టైం ఉండదు. వచ్చీరాగానే హిట్టింగ్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇకపోతే పరాగ్ 16.80 బ్యాటింగ్ సగటుతో 143.59 స్ట్రైక్ రేట్‌తో మొత్తం 168పరుగులు చేశాడు. డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీలో జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఆర్సీబీపై అతనికి మంచి రికార్డ్ ఉంది. అతను ఆ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేసి రాజస్థాన్ జట్టుకు విజయఢంకా మోగించాడు. అతను ఆ మ్యాచ్‌లో (31బంతుల్లో 56పరుగులు నాటౌట్) రాణించాడు.

2019నుంచి రాజస్థాన్ తరఫున ఆడుతున్నాడు
అస్సాం రాష్ట్రానికి చెందిన రియాన్ పరాగ్.. ఐపీఎల్ 2019 సీజన్ నుండి రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ తరఫున ఆడుతున్నాడు. అతన్ని తొలి సీజన్లో కేవలం రూ.20లక్షలకు రాజస్థాన్ కొనుగోలు చేసింది. ఇక ఐపీఎల్ 2022 కోసం మెగా వేలానికి ముందు అతన్ని రాజస్థాన్ రాయల్స్ రిలీజ్ చేసింది. ఇక మళ్లీ మెగా వేలంలో సీఎస్కే, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లతో పోటీ పడి మరీ రాజస్థాన్ రాయల్స్ అతనిని రూ.3.80కోట్లకు కొనుగోలు చేసింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications