Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

గిల్‌లా అందరికీ మంచి రాశి ఉండదేమో!: సెలక్టర్లపై మాజీ క్రికెటర్ చురకలు

శ్రీలంక పర్యటనకు భారత జట్టును బీసీసీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. ఊహించనట్లుగానే నయా కోచ్ గౌతమ్ గంభీర్ మార్క్ జట్టుపై స్పష్టంగా కనిపించింది. అజిత్ అగార్కర్ నేతృత్వంలో సెలక్షన్ కమిటీ సీనియర్ల ఆటగాళ్లను కొనసాగిస్తూ యువకులకు అవకాశం ఇచ్చింది. జులై 27 నుంచి ప్రారంభంకానున్న మూడు టీ20ల సిరీస్‌కు సూర్యకుమార్ యాదవ్‌ను కెప్టెన్‌గా నియమించింది.

టీ20 జట్టులో కొనసాగుతున్నప్పటికీ హార్దిక్ పాండ్యకు సారథి బాధ్యతలు అందివ్వలేదు. వన్డే జట్టులో హార్దిక్ ఎంపికకాలేదు. ఇక శుభ్‌మన్ గిల్‌ను బీసీసీఐ వైస్ కెప్టెన్‌గా ప్రమోట్ చేసింది. వన్డే, టీ20 జట్లకు వైస్‌కెప్టెన్‌గా నియమించింది. మరోవైపు జింబాబ్వే పర్యటనలో సత్తాచాటిన అభిషేక్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్‌కు నిరాశే మిగిలింది. జట్టులో చోటు దక్కించుకోలేకపోయారు.

Ruturaj Needs to Score More Runs to Impress Selectors Unlike Shubman Gill s Zodiac Luck- Kris Srikkanth

అయితే రుతురాజ్ గైక్వాడ్‌ భారత జట్టులో చోటు కోల్పోవడంపై టీమిండియా మాజీ క్రికెటర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ సెలక్టర్లపై విమర్శలు గుప్పించాడు. శుభ్‌మన్ గిల్‌లా అందరికీ మంచి రాశి ఉండదని, సెలక్టర్లు రుతురాజ్‌ను కూడా పరిగణించాల్సిందని అన్నాడు. ''రుతురాజ్ టీ20లకు ప్రధాన ఎంపిక. అతన్ని ఎంపిక చేయాల్సింది. ఇక రుతురాజ్ మరన్ని పరుగులు చేయాలి. సెలక్టర్లు అతన్ని కూడా చూడాలి. ఎందుకంటే శుభ్‌మన్ గిల్‌లా అందరికి మంచి రాశి ఉండదు కదా'' అని శ్రీకాంత్ పేర్కొన్నాడు.

రుతురాజ్ సందర్భాన్ని బట్టి గేర్‌లు మార్చుతూ ఇన్నింగ్స్‌కు నిర్మించే సామర్థ్యం ఉంది. అంతేగాక ధనాధన్ ఇన్నింగ్స్ ఆడగలడు. కోహ్లికి వారసుడిలా అతను జింబాబ్వే పర్యటనలో సత్తాచాటాడు. అజేయంగా 77 పరుగులు, మరో ఇన్నింగ్స్‌లో 49 పరుగులతో రాణించాడు. అంతేగాక గత ఏడు టీ20 ఇన్నింగ్స్‌‌ల్లో రుతురాజ్ 71 సగటుతో, 158 స్ట్రైక్‌రేటుతో పరుగులు చేశాడు. కానీ శ్రీలంక పర్యటనలో టీ20 సిరీస్‌లో రుతురాజ్ చోటు దక్కించుకోలేకపోయాడు. బ్యాకప్ ఓపెనర్‌గా కూడా సెలక్ట్ కాలేదు.

Story first published: Friday, July 19, 2024, 18:46 [IST]
Other articles published on Jul 19, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+