CSK vs RCB: చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ వ్యాఖ్యలు ఆ జట్టు అభిమానులను అసంతృప్తికి గురిచేశాయి. దీనికి కారణం రుతురాజ్ గైక్వాడ్ ఆర్సీబీపై 50 పరుగుల తేడాతో ఓటమి గురించి మాట్లాడడమే. ఐపీఎల్ 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన రెండో లీగ్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఓడిపోయింది. అది కూడా 50 పరుగుల తేడాతో అవమానకరమైన ఓటమిని చవిచూసింది. టీ20 మ్యాచ్‌లలో 50 పరుగుల తేడాతో ఓడిపోవడం కచ్చితంగా దారుణమైన ఓటమే.
ఈ ఓటమిపై తాము ఎలాంటి ఆందోళనకు గురి కావడం లేదని.. ఇది పెద్ద మార్జిన్ కూడా కాదని సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అన్నాడు. పెద్ద తేడాతో ఓడిపోలేదని.. కేవలం 50 పరుగుల తేడాతో ఓడియామని పేర్కొన్నాడు. చెపాక్ స్టేడియం పిచ్ పై ఆర్సీబీని 170 పరుగులకే పరిమితం చేస్తామనుకున్నామని.. ఇక్కడ బ్యాటింగ్ చేయడం చాలా కష్టమని గైక్వాడ్ తెలిపాడు. 170 పరుగుల లక్ష్యం ఛేదించాల్సి వచ్చినప్పుడు పరిస్థితి వేరుగా ఉంటుందని.. కానీ తాము అదనంగా 20 పరుగులు ఇచ్చామని అన్నాడు. అయినా తాము 50 పరుగుల తేడాతోనే ఓడిపోయామని.. ఇదేమీ భారీ మార్జిన్ కాదన్నాడు.

సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ప్రసంగం అభిమానుల నుంచి విమర్శలకు గురైంది. అయితే 50 పరుగుల ఓటమిని సాధారణ ఓటమిలాగా ఆయన మాట్లాడటం సీఎస్కే అభిమానుల నుంచి విమర్శలకు దారితీసింది. హార్దిక్ పాండ్యా గతంలో భారత జట్టు తాత్కాలిక కెప్టెన్ గా ఉన్నప్పుడు ఒక షాకింగ్ ప్రకటన చేశాడు. వెస్టిండీస్‌తో జరిగిన ఓటమి గురించి హార్దిక్ పాండ్యాను అడిగినప్పుడు.. ఓటమిలో కూడా ప్రత్యేకంగా ఉండడం సరైన విషయమని చెప్పాడు. ఆ సమయంలో హార్దిక్ పాండ్యా బాధ్యతారహితంగా మాట్లాడాడని చాలా మంది విమర్శించారు. సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ దాదాపు అలాంటి ప్రసంగమే చేశారని చాలా మంది ఎత్తిచూపారు.