Ruturaj Gaikwad About RCB Captain: పాపం ఫాప్ డుప్లెసిస్.. మా ఆటను చూసి కుళ్లుకుని ఉంటాడు

చెన్నై ప్లేయర్ రుతురాజ్ గైక్వాడ్ 57బంతుల్లో 99 పరుగులు చేసి ఆదివారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. 25ఏళ్ల ఈ బ్యాటర్ ఈ సీజన్‌లో అంతగా తన సత్తా చాటలేదు. కానీ నిన్న పూణేలోని ఎంసీఏ స్టేడియంలో తిరిగి తన మార్క్ బ్యాటింగ్‌తో తనలోని ఫైర్ చూపించాడు. ఇక ధోనీ తిరిగి సీఎస్కేకు నాయకత్వం వహించిన ఈ మ్యాచ్‌లో చెన్నై గెలిచి ప్లేఆఫ్ రేసులో ఇంకా సజీవంగా ఉంది. రుతురాజ్ సెంచరీకి ఒక పరుగు దూరంలో ఔటయినప్పటికీ.. అతని ఓపెనింగ్ భాగస్వామి డెవాన్ కాన్వే చివరి వరకు క్రీజులో నిలబడ్డాడు. సూపర్ కింగ్స్ తరపున తన మొదటి అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్న ఈ కొత్త పెళ్లి కొడుకు.. 55బంతుల్లో 8ఫోర్లు, 4 సిక్సర్లతో 85పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.

చెన్నై తరఫున రికార్డ్ భాగస్వామ్యం
రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే జట్టుకు రికార్డు (182పరుగుల) భాగస్వామ్యాన్ని అందించారు. ఇది ఐపీఎల్ చరిత్రలో చెన్నై తరుఫున అత్యధిక భాగస్వామ్యం. 2020 సీజన్‌లో పంజాబ్ కింగ్స్‌పై చెన్నై ఓపెనర్లు ఫాఫ్ డుప్లెసిస్, షేన్ వాట్సన్ 181పరుగుల భాగస్వామ్యం నమోదు చేయగా.. ఆ రికార్డును రుతురాజ్, కాన్వే జోడి బద్ధలుకొట్టింది. ఈ క్రమంలో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును సొంతం చేసుకున్న రుతురాజ్.. తన మాజీ ఓపెనింగ్ పార్ట్‌నర్ ప్రస్తుత ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్‌పై సరదా వ్యాఖ్యలు చేశాడు. 'మా ఇద్దరి పార్ట్ నర్ షిప్ చూసి ఫాఫ్ డుప్లెసిస్ కొంచెం అసూయపడతాడని అనుకుంటున్నాను. అయినా పర్వాలేదు. ఇలాంటి పార్ట్ నర్ షిప్ రికార్డును కలిగి ఉండటం నిజంగా ఆనందంగా ఉంది.' అని రుతురాజ్ పేర్కొన్నాడు.

గత సీజన్లో నంబర్ 1 రుతురాజ్, నంబర్ 2 ఫాఫ్ డుప్లెసిస్
గతేడాది రుతురాజ్ 635పరుగులతో టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. రెండో స్థానంలో అతని ఓపెనింగ్ భాగస్వామి డుప్లెసిస్ 633పరుగులతో నిలిచాడు. ఇక సీఎస్కే టీవీలో రుతురాజ్ మాట్లాడుతూ.. "పవర్‌ప్లేలో నేను, కాన్వే సరిగ్గా ప్రారంభించలేదు. కానీ మనం హిట్టింగ్ చేయగలే వీలుందని అతనికి చెప్పాను. తర్వాత మేము మెల్లిగా గేర్ మార్చాం. పరుగులు వచ్చాయి' అని కాన్వేతో తన భాగస్వామ్యం గురించి రుతురాజ్ చెప్పాడు.

తల్లిదండ్రులను గుర్తు చేసుకున్న గైక్వాడ్
ఇక ఈ మ్యాచ్ తనకు ప్రత్యేకమన్న రుతురాజ్ మ్యాచ్ చూడడానికి తన కోసం తన తల్లిదండ్రులు వచ్చారని చెప్పాడు. వారు స్టాండ్స్‌లో ఉన్నారని పేర్కొన్నాడు. తన క్రికెట్ జర్నీ పరంగా వారి నుంచి తనకు లభిస్తున్న నిరంతర మద్దతుకు కృతజ్ఞతలు తెలిపాడు. ఇది చాలా ప్రత్యేక ఇన్నింగ్స్ అని పేర్కొన్నాడు. తన తల్లిదండ్రులను గర్వపడేలా చేశానని ఆశిస్తున్నట్లు అభిప్రాయం వ్యక్తం చేశాడు.

సీఎస్కే తరఫున అత్యధిక భాగస్వామ్యాలు
1. రుతురాజ్ గైక్వాడ్ & డెవాన్ కాన్వే - 182పరుగులు
2. షేన్ వాట్సన్ & ఫాఫ్ డుప్లెసిస్ - 181* పరుగులు
3. రాబిన్ ఉతప్ప & శివమ్ దూబే - 165 పరుగులు
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications