రుతురాజ్ చెత్త రికార్డు.. చరిత్రలో ఒకే ఒక్కడు!
లక్నో సూపర్ కింగ్స్ చేతిలో చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా రెండో ఓటమి చవిచూసింది. మంగళవారం చెపాక్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. భారీ స్కోరును కాపాడుకోలేక టాప్-4లో స్థానాన్ని చేజార్చుకుంది. పాయింట్ల పట్టికలో అయిదో స్థానానికి పడిపోయింది.
తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే నాలుగు వికెట్లకు 210 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్ (108*; 60 బంతుల్లో, 12x4, 3x6) అజేయ శతకంతో చెలరేగాడు. అతనికి తోడుగా శివమ్ దూబె (66; 27 బంతుల్లో, 3x4, 7x6) కూడా సత్తాచాటాడు. అనంతరం ఛేదనలో లక్నో 19.3 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. మార్కస్ స్టొయినిస్ (124*; 63 బంతుల్లో, 13x4, 6x6) విధ్వంసం సృష్టించి లక్నోను విజయతీరాలకు చేర్చాడు. నికోలస్ పూరన్ (34; 15 బంతుల్లో, 3x4, 2x6) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.

అయితే సెంచరీ చేసిన రుతురాజ్ తన పేరిట కోరుకోని రికార్డును నమోదు చేసుకున్నాడు. సెంచరీ చేసినప్పటికీ జట్టును గెలిపించలేకపోయిన ఏకైక సీఎస్కే ప్లేయర్‌గా చరిత్రలో నిలిచాడు. అంతేగాక మరో పేలవ రికార్డును రుతురాజ్ తన ఖాతాలో వేసుకున్నాడు. పరాజయాన్ని చవిచూసిన జట్టులో అత్యధిక సెంచరీ సాధించిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. ఐపీఎల్‌లో రుతురాజ్ గైక్వాడ్ ఇప్పటివరకు రెండు శతకాలు బాదాడు. ఆ రెండు మ్యాచ్‌ల్లోనూ తన జట్టు ఓటమిపాలైంది.
ఈ జాబితాలో అగ్రస్థానంలో విరాట్ కోహ్లి ఉన్నాడు. కోహ్లి సెంచరీ చేసిన మూడు మ్యాచ్‌ల్లో ఆర్సీబీ ఓటమిపాలైంది. కోహ్లి తర్వాతి స్థానంలో హషీమ్ ఆమ్లా (2), సంజు శాంస్ (2), రుతురాజ్ (2) ఉమ్మడిగా ఉన్నారు. ఈ ముగ్గురు మూండకెల స్కోరు అందుకున్నప్పటికీ రెండు మ్యాచ్‌ల్లో జట్టును గెలిపించలేకపోయారు. సీఎస్కే-ఎల్‌సీజీ మ్యాచ్‌లో మరో రికార్డు నమోదైంది. ఐపీఎల్‌లో ఓ మ్యాచ్‌లో రెండు సెంచరీలు నమోదైన ఏడో మ్యాచ్‌గా ఈ పోరు రికార్డులకెక్కింది. ఈ జాబితాలో ఈ సీజన్‌లోనే జరిగిన మూడు మ్యాచ్‌లు ఉండటం విశేషం.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications