Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

గోల్డ్ మెడల్ మా లక్ష్యం.. టీమిండియా కెప్టెన్సీ లభించడంపై గైక్వాడ్ రియాక్షన్!

ఆసియా క్రీడల్లో తొలిసారి భారత క్రికెట్ జట్టు పాల్గొంటోంది. 2014లో ఈ టోర్నీలో క్రికెట్ కూడా ఉంది. కానీ అప్పుడు భారత జట్టు ఈ పోటీల్లో పాల్గొనలేదు. అయితే ఈసారి తమ జట్టును పంపాలని బీసీసీఐ డిసైడ్ అయింది. పూర్తిగా కొత్త కుర్రాళ్లను అక్కడకు పంపుతున్నట్లు ప్రకటించింది. ఈ జట్టుకు కెప్టెన్‌గా సీఎస్‌కే ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్‌కు అవకాశం ఇచ్చింది.

చైనా వేదికగా జరిగే ఈ ఆసియా క్రీడలు కూడా వన్డే వరల్డ్ కప్ ఉన్న సమయంలోనే జరుగుతాయి. ఈ క్రమంలోనే చైనాకు కొత్త కుర్రాళ్లతో కూడిన జట్టును పంపాలని బీసీసీఐ డిసైడ్ అయింది. ఈ టీంకు సారధ్యం వహించే అవకాశం దక్కినందుకు రుతురాజ్ గైక్వాడ్ సంతోషం వ్యక్తం చేశాడు. ఈ టోర్నీలో గోల్డ్ మెడల్ సాధించి, పోడియంలో జాతీయ గీతం వినాలని కోరుకుంటున్నట్లు గైక్వాడ్ చెప్పాడు.

Ruturaj Gaikwad

ప్రస్తుతం వెస్టిండీస్‌లో పర్యటిస్తున్న భారత జట్టులో గైక్వాడ్ కూడా ఉన్నాడు. వైట్ బాల్ క్రికెట్‌లో దేశవాళీల్లో అద్భుతంగా రాణించిన అతను.. భారత జట్టు తరఫున అంత గొప్పగా ఆకట్టుకోలేదు. ప్రస్తుతం భారత క్రికెట్ అంతా మారిపోయే పరిస్థితిలో ఉంది. ఇప్పుడు గైక్వాడ్ కనుక చక్కగా రాణించి, ఆసియా క్రీడల్లో గోల్డ్ మెడల్ సాధిస్తే అతని కెరీర్‌కు ఈ విజయం చాలా ఉపయోగపడుతుంది.

'ఈ అవకాశం చాలా స్పెషల్ అని భావిస్తున్నా. భారతీయులంతా గర్వించే క్రికెట్ ఆడతాం. ఆసియా క్రీడల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తూ మెడల్ గెలవడం నిజంగా చాలా ఎగ్జయిటింగ్ అనుభవం. ఎప్పుడూ టీవీల్లో అథ్లెట్లకే ఈ అవకాశం దక్కడం చూశాం. ఇప్పుడు ఆ అవకాశం, దేశం కోసం మెడల్ గెలిచే ఛాన్స్ దక్కడం నిజంగా చాలా స్పెషల్‌గా అనిపిస్తోంది' అని గైక్వాడ్ అన్నాడు.

'భారత్‌ తరఫున ఆడటమే చాలా ప్రౌడ్ ఫీలయ్యే విషయం. అలాంటిది ఆసియా గేమ్స్ వంటి ప్రఖ్యాత ఈవెంట్‌లో జట్టుకు నాయకత్వం వహించడం అంటే మాటలు కాదు. ఇది వ్యక్తిగతంగా నాకు, నా టీంమేట్స్‌కు దక్కిన చాలా గొప్ప గౌరవం' అని గైక్వాడ్ తెలిపాడు. అతనికి ఈ టీం కెప్టెన్సీ ఇవ్వడంపై ఫ్యాన్స్ కూడా చాలా సంతోషం వ్యక్తం చేశారు. అతను కచ్చితంగా గోల్డ్ మెడల్ సాధిస్తాడని ఆశిస్తున్నారు.

టీమిండియా : రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, రాహుల్ త్రిపాఠీ, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేశ్ శర్మ, వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, రవి బిష్ణయి, ఆవేష్ ఖాన్,, అర్షదీప్ సింగ్, ముఖేష్ కుమార్, శివమ్ మావి, శివమ్ దూబే, ప్రభ్‌సిమ్రాన్ సింగ్

స్టాండ్ బై ప్లేయర్లు: వెంకటేశ్ అయ్యర్, యష్ ఠాకూర్, సాయి కిషోర్, దీపక్ హుడా, సాయి సుదర్శన్

Story first published: Sunday, July 16, 2023, 12:16 [IST]
Other articles published on Jul 16, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+