అతడి వల్లే ఓడిపోయాం: రుతురాజ్ గైక్వాడ్
లక్నోలోని ఎకానా స్టేడియం వేదికగా జరిగిన కీలక మ్యాచ్‌లో లక్నో జట్టుపై పరాజయం అనంతరం సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ తన మనసులోని మాటను పంచుకున్నాడు. ఈ ఓటమికి గల కారణాలను విశ్లేషిస్తూనే, జట్టులోని సానుకూల అంశాలను రుతురాజ్ ప్రస్తావించాడు. మ్యాచ్ అనంతరం రుతురాజ్ మాట్లాడుతూ.. మైదానంలో ఫాస్ట్ బౌలర్లకు పిచ్ కొంత సహకరించిందని అభిప్రాయపడ్డాడు. "మేము బ్యాటింగ్ చేస్తున్నప్పుడు హార్డ్ లెంగ్త్ బంతులను ఎదుర్కోవడం కష్టంగా అనిపించింది, లక్నో బౌలర్లు చాలా క్రమశిక్షణతో బౌలింగ్ చేశారు. నిజానికి మేము 160 నుంచి 170 పరుగులు వస్తాయని ఆశించాం, కానీ 187 పరుగులు సాధించగలిగాం. బ్యాటింగ్ పరంగా మేము చేయగలిగినంత చేశాం. కానీ లక్నో బ్యాటర్లకు క్రెడిట్ ఇవ్వాల్సిందే, వారు అద్భుతంగా ఆడారు. మ్యాచ్ సాగుతున్న కొద్దీ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలించిందో లేదో తెలియదు కానీ, వారు మాత్రం అసాధారణమైన షాట్లు ఆడారు" అని రుతురాజ్ పేర్కొన్నాడు.
మిచెల్ మార్ష్ విధ్వంసం
లక్నో ఓపెనర్ల విధ్వంసాన్ని అడ్డుకోవడానికి తాము చేసిన ప్రయత్నాలను రుతురాజ్ గైక్వాడ్ వివరించాడు. "మిచెల్ మార్ష్ షార్ట్ బాల్స్‌ను చాలా బాగా ఆడతారని మాకు తెలుసు. అందుకే సరైన టెస్ట్ మ్యాచ్ లెంగ్త్‌లో బౌలింగ్ చేసి వారిని కట్టడి చేయాలనుకున్నాం. బంతి కొంచెం నిబ్బిల్ అవుతున్నట్లు అనిపించింది కానీ, మార్ష్ అద్భుతమైన షాట్లతో విరుచుకుపడ్డాడు. కొన్ని చోట్ల మా ఎగ్జిక్యూషన్ లోపించింది, కొన్ని బంతులు తప్పుగా వేశాం. లక్నో ఓపెనర్లిద్దరూ అద్భుతంగా రాణించి మాకు అవకాశం ఇవ్వలేదు" అని రుతురాజ్ చెప్పుకొచ్చాడు.

యువ ఆటగాడు కార్తీక్ శర్మపై ప్రశంసలు
ఈ సీజన్ ప్రయాణం గురించి మాట్లాడుతూ రుతురాజ్ ఓ సానుకూల విషయాన్ని పంచుకున్నాడు. "కొన్నిసార్లు ప్రత్యర్థి జట్టు మనకంటే మెరుగైన క్రికెట్ ఆడుతుంది, దానిని మనం అంగీకరించాలి. ఈ మ్యాచ్‌లో మాకు దక్కిన అతిపెద్ద ప్లస్ పాయింట్ యువ ఆటగాడు కార్తీక్ శర్మ. అతను ఎంతో ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్ చేసి 71 పరుగులు సాధించడం చూడముచ్చటగా ఉంది. మిడిల్ ఆర్డర్ సమస్యలు ఉన్నప్పటికీ, టోర్నీ ముగింపు దశకు వచ్చేసరికి మా బ్యాటింగ్ క్లిక్ అవుతుండటం, బౌలర్లు రాణిస్తుండటం నాకు నమ్మకాన్ని ఇస్తోంది. ఈ రోజు కేవలం మాకు కలిసి రాని రోజు మాత్రమే" అని రుతురాజ్ ధీమా వ్యక్తం చేశాడు.
తదుపరి లక్ష్యం.. 'సింపుల్ కాలిక్యులేషన్'
ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే అనుసరించాల్సిన వ్యూహం గురించి రుతురాజ్ స్పష్టతనిచ్చాడు. "ముందుగా చెన్నైకి చేరుకోవాలి, అది సుదీర్ఘ ప్రయాణం. ఆ తర్వాత మేము ఎక్కడ మెరుగుపడాలో ఆ అంశాలపై దృష్టి సారిస్తాం. మా ముందున్న లెక్క చాలా సింపుల్.. ఇకపై ఆడే ప్రతి మ్యాచ్‌ను గెలవాలి. ఇందులో క్లిష్టంగా ఆలోచించాల్సింది ఏమీ లేదు. పరిస్థితులకు త్వరగా అలవాటు పడి, మాకు కలిసొచ్చే రోజున గరిష్టంగా రాణించి ఫలితాన్ని మా వైపు తిప్పుకుంటామని ఆశిస్తున్నాను. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, మేము బలంగా పుంజుకుంటాం" అని కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ముగించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications